ఐదేళ్లు పూర్తయిన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ

 

అమరావతి :

బుధవారం కేబినెట్‌ సమావేశం తర్వాత పీఆర్సీపై నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. 2014 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు బుధవారం నిర్వహించనున్న కేబినెట్‌ భేటీలో ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఏపీ రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవో ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలు భేటీకి హాజరయ్యారు. 12వ వేతన సవరణ సంఘంపైనా ఉద్యోగ సంఘాలతో చర్చించారు. కేబినెట్‌ సమావేశంలోనే దీనిపైన కూడా ప్రకటన విడుదల చేయనున్నారు. మరోవైపు పీఆర్సీ ఛైర్మన్‌గా మాజీ సీఎస్‌ సమీర్‌శర్మ పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనిని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest