స్కూల్ అడ్మిషన్లలో కులం అనే కాలం తొలగించాలని తమిళ దర్శకుడు , తమిళ దర్శకుల సంఘం కోశాధికారి పేరరసు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుళందై కేరాఫ్ గౌండం పాలేయం సినిమా ఆడియో విడుదల వేదికలో పేరరసు ఈ వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు అనేవాడు సమాజ చైతన్యం కోసం కృషి చెయ్యాలి . పేర్ల వెనుక ఉన్న కులాల పేర్లను ప్రభుత్వం తొలగించడం భావ్యం కాదు. ఈ పని చేసే ముందు … స్కూల్ అడ్మిషన్ లో కులం అనే కాలం పూర్తిగా రద్దు చెయ్యాలి అని పేరరసు అన్నారు.
ప్రేమ పేరుతో నటించి ఒక మహిళను మోసం చేయడం, అత్యాచారం చెయ్యడం ఒకటేనని ఆయన అన్నారు. మహిళను మోసం చేసే వాడిని మృగజాతికి చెందిన వాడిగా పరిగణించాలి. ఈ ట్రైలర్ చూస్తే ఒక తండ్రి స్థానంలో హీరో రంజిత్ ఉండి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలందరికీ కూడా ఇదే తరహా కోపం రావాలి.
దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఈ సినిమాకు గౌండం పాలేయం అనే టైటిల్ పెట్టడం వల్ల ఒక కులానికి చెందిన సినిమాగా చూడొద్దు అని అన్నారు. తాను చిన్న గౌండర్ సినిమాని తీసినప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. పైగా ఆ సినిమా సిల్వర్ జూబిలీ సినిమాగా ఆడింది. అందువల్ల ఈ సినిమాను కూడా మరో కోణంలో కాకూండా సినిమాగా చుడండి అని చెప్పారు. రంజిత్ హీరోగా, అల్ఫీన హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ పాసతాయ్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.