కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ హాస్య స్పదంగా ఉన్నది:కొప్పుల

హైదరాబాద్ :

కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్ హాస్య స్పదంగా ఉన్నదని   సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు .39 లక్షల 45వేల కోట్ల బడ్జెట్ లో ఎస్సి లకు 15 వేలు, ఎస్టీ లకు 15వేలు, బీసీలకు కేవలం 1400 కోట్లు మాత్రమే కేటాయించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 38 వేల కోట్లు ఎస్సీల అభ్యున్నతి కి ఖర్చు చేస్తుంటే, కేంద్రం దేశ వ్యాప్తంగా కేవలం 15 వేల కోట్లు కేటాయించడం సిగ్గు చేటు.కేంద్ర బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, బిసి లకు మొండి చేయి చూపించారు. దేశ వ్యాప్తంగా అనగారిన వర్గాలను కేంద్ర ప్రభుత్వం అవమాన పరిచింది.మోడీ పాలనలో అన్యాయం, వివక్ష కొనసాగుతున్నదనడానికి కేంద్ర బడ్జెట్ నిదర్శనం.రైతు, ఉద్యోగులు, ఉపాధి హామీ కూలీలకు ఈ బడ్జెట్ వ్యతిరేకంగా ఉన్నది.కార్పోరేట్ల కు కొమ్ము కాసే విధంగా బడ్జెట్‌ ఉన్నది.కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వ్యవసాయంతో పాటు ఇతర రంగాలను పట్టించు కోనేలేదు. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసే విధంగా బడ్జెట్‌ వుంది.రాష్ట్రాలను కేంద్ర బడ్జెట్ ఆర్థికంగా దెబ్బతీసింది.విద్య, వైద్య రంగాలను పట్టించుకోలేదు.ముఖ్యంగా తెలంగాణకు మొండిచేయి చూపించింది. విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు.ఎన్నికలున్న కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్లు కేటాయించారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని విస్మరించారు.మాటలు కోటలు తప్ప.. నిధుల కేటాయింపులో ప్రాధాన్యత చూపించలేదు.తొమ్మిదేళ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గురించి మాటలేదు. గ్రామీణ ఉపాధి హామి నిధుల్లో కోత పెట్టారు, ఆహార సబ్సిడీలు తగ్గించారు.ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా ఏమీ లేదు.జీఎస్టీ రూపంలో దేశ ఉత్పత్తి, సేవా పన్నుల రూపంలో ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నామని కేంద్రం చెబుతున్నా, ఈ విధానాలు కేవలం కార్పోరేట్, సంపన్న వర్గాలకు మాత్రమే మేలు చేకూర్చే విధంగా ఉన్నయే తప్ప, సంపద సృష్టిస్తున్న బడుగు జీవులకు ఒరిగిందదేమి లేదన్నారు. దేశంలో కులవృత్తులనే నమ్ముకుని జీవనం కోనసాగిస్తున్న వారి పరిస్థితులు రోజు రోజుకు దయనీయంగా మారుతున్నాయి.వంట నూనెలు, పెట్రోల్, డిజిల్ తో పాటు ఇతర నిత్యావసర ధరలు ఈ బడ్జెట్లో పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాల ఆశలు గల్లంతయ్యాయి.కేంద్ర బడ్జెట్ ను పున: సమీక్షించాలి అని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest