సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి విద్యుత్తు సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణ పలు కాలనిలలో విద్యుత్తు నిలిపివేసిన సింగరేణి యజమాన్యం…!సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి విద్యుత్తు సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామీ . బెల్లంపల్లి పట్టణం లోని పలు కాలనీలలో గత కొన్ని రోజులుగా విద్యుత్ ని నిలిపేసిన సింగరేణి సంస్థ. బెల్లంపల్లి లోని పలు వార్డులలో ప్రభుత్వం కు సరెండర్ చేసిన క్వార్టర్స్ కి అలాగే కార్మికులుంటున్న కొన్ని క్వార్టర్స్ ప్రభుత్వం కు సరెండర్ చేసారు.ప్రభుత్వం కు సరెండర్ చేసిన స్థలాలలో ట్రాన్స్ కో సంస్థ, కరెంట్ పోల్స్ వేసి నూతన విద్యుత్ లైన్లు వేసి కరెంట్ ఇవ్వాల్సి ఉండగా, ట్రాన్స్ కో సంస్థ విద్యుత్ సరఫరా పై చర్యలు చేపట్ట లేదు. ప్రభుత్వం కు అప్పచేప్పిన పలు కాలనిలకు క్వార్టర్స్ లకు సింగరేణి సంస్థ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గత ముడు రోజులనుండి కాలనీలు, సింగరేణి క్వార్టర్స్ లలో కరెంట్ లేక అంధకారం లో ఉన్నాయని, స్థానిక బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్  దృష్టికి రావడం తో వెంటనే సింగరేణి డైరెక్టర్ తో అలాగే ఏరియ జిఎం గారితో మాట్లాడడంతో వారు వెంటనే స్పందించి విద్యుత్ సరఫర చేస్తాం అని హామీ ఇచ్చి కరెంట్ సరఫరా చేశారు, దీంతో చెప్పడం పట్టణంలోని పలు కాలనీవాసులు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest