ఆర్ఆర్ఆర్ టీమ్ అవార్డ్ కొనుక్కున్నారు అనే ప్రచారం 

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్‌ ఆర్ సినిమా లోని నాటు నాటు అనే పాట అంతర్జాతీయ స్థాయి గోల్డెన్ గ్లోబ్‌ అవార్డును సొంతం చేసుకుంది.

బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్‌ ఆనందానికి అవదులు లేవు. అంతర్జాతీయ స్థాయి పురష్కారం దక్కించుకున్న కీరవాణి పై ప్రధాని నరేంద్ర మోడీ సహా ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినందనలతో పాటు విమర్శలు కూడా అప్పుడప్పుడు ఉంటాయి. ఇప్పుడు నాటు నాటు అవార్డు పై విమర్శలు కూడ ఆ వస్తున్నాయి.

ఒక సీనియర్ జర్నలిస్ట్‌ తన ఫేస్ బుక్ లోనాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డును కొనుక్కున్నారు అంటూ ఆరోపించాడు. అంతర్జాతీయ స్థాయి అవార్డులు ఇచ్చే యొక్క జ్యూరీని కొనుగోలు చేసేంత స్థాయి జక్కన్న టీమ్‌ కు ఉందా అంటే ఆయన అవును అనే సమాధానం చెబుతున్నాడు. ఈ అవార్డు రావడం వెనుక పబ్లిసిటీ కృషి ఉంది. అది మాత్రం వాస్తవం కానీ కొనుగోలు చేశారు అనేది మాత్రం నూటికి నూరు శాతం అవాస్తవం. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాను అంతర్జాతీయ వేదిక మీద పబ్లిసిటీ చేయడం


జరిగింది. ఆ పబ్లిసిటీ బాగా కలిసి వచ్చి ఈ సినిమాకు అవార్డు దక్కింది. అంతే కాని అవార్డును కొనుగోలు చేయలేదు. ఎంతటి గొప్ప సినిమా అయినా కూడా పబ్లిసిటీ చేస్తేనే జనాల్లోకి వెళ్తుంది. అలాగే అవార్డులను దక్కించుకుంటుంది. అదే జక్కన్న టీమ్‌ చేశారు. అంతే తప్ప అవార్డును కొనుగోలు చేయలేదు. సోషల్‌ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. మన సినిమాకు ఇలాంటి అంతర్జాతీయ స్తాయి అవార్డు రావడంను ప్రతి ఒక్కరు సంతోషించాల్సిన విషయం.. అంతే తప్ప కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కరెక్ట్‌ కాదు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest