ప్రపంచం భారత్ బడ్జెట్ వైపు చూస్తోంది

న్యూ ఢిల్లీ
దేశంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. సమావేశాలు ప్రారంభం కాక ముందే మోడీ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచమంతా భారత్ బడ్జెట్ వైపు చూస్తోందని అన్నారు. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు వచ్చాయని చెప్పారు. ఒక పక్క ప్రపంచమంతా ఆర్ధిక మాంద్యం కనిపిస్తున్న ఈ తరుణంలో భారత్ బడ్జెట్ ఎలా ఉండబోతోంది అనే అంశంపై ప్రపంచమంతా మనవైపే చూస్తోందని చెప్పారు. ఈ సమావేశాలు , ప్రపంచం నుంచి వచ్చే సందేశాలు కొత్త ఉత్సహానికి నాంది అని వ్యాఖ్యానించారు. తొలిసారిగా రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించ నున్నారని చెప్పారు. ఇండియా ఫస్ట్ సిటిజన్ ఫస్ట్ అనే నినాదంతో బడ్జెట్ ముందుకు వెళ్తుందని మోడీ పేర్కొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest