Every moment of my life is dedicated to upholding the noble values enshrined in the Constitution of India, given to us by Dr. Babasaheb Ambedkar. It is only due to the Constitution that a person like me, born into poverty and in a backward family, is able to serve the nation. Our Constitution gives crores of people hope, strength and dignity: Narendra Modi.
పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీయే కూటమి ఎంపీలతో మోడీ భేటీ అయ్యారు. కూటమిలో ఉన్నటువంటి నేతల గురించి తెగ పొగిడేశారు. మూడోసారి ప్రధాని కాబోతున్నందుకు మోడీ సంతోషపడిపోయారు. అక్కడ ఉన్న రాజ్యాంగాన్ని తీసుకుని కళ్ళకు అద్దుకున్నారు. ఎన్నికల సమయంలో రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటనలు చేసినా నోరుమెదపని మోడీ ఇప్పుడు అధికారం చేతిలోకొచ్చేసరికి రాజ్యాంగమే గొప్పదని వ్యాఖ్యానించారు. ఇది రాజ్యాంగం మీద ఉన్న ప్రేమానో లేక మోచ్చటగా మూడోసారి కొత్త నాకటమో వేచి చూద్దాం.
”నా జీవితంలోని ప్రతి క్షణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉదాత్తమైన విలువలను నిలబెట్టడానికి అంకితం చేస్తున్నాను. పేదరికంలో, వెనుకబడిన కుటుంబంలో పుట్టిన నాలాంటి వ్యక్తి దేశానికి సేవ చేయగలిగేది రాజ్యాంగం వల్లనే. మన రాజ్యాంగం కోట్లాది మందికి ఆశ, బలాన్ని, గౌరవాన్ని ఇచ్చింది”. అని మోదీ వ్యాఖ్యానించారు.