TSMSIDC పై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష

  • TSMSIDC పై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష.
  • నాణ్యతతో కూడిన మందులను డ్రగ్స్ లను కొనుగోలు చేయాలి.
  • వైద్య కళాశాల ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి.
  • నాణ్యమైన MCH, న్యూట్రిషన్ కిట్స్ లను కొనుగోలు చేసి అనుకున్న సమయానికి సరఫరా చేయాలి .
  • రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశం .

హైదరాబాదు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రి C. దామోదర రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోనీ తన కార్యాలయంలో తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా (TSMSIDC) చేపడుతున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పనితీరు పై సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో TSMSIDC ద్వారా నిర్మిస్తున్న వైద్య కళాశాల ల బిల్డింగ్ నిర్మాణ పనులు, నర్సింగ్ కాలేజ్ ల నిర్మాణం, కళాశాలల సామర్థ్యం పెంపుదల, మౌలిక సదుపాయాల కల్పన, అధునాతన ఎక్విప్మెంట్ ల కొనుగోలు తో పాటు మందులు, డ్రగ్స్ , MCH కిట్స్, న్యూట్రిషన్ కిట్లను నాణ్యత తో కూడిన వాటిని కొనుగోలు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన మందులను, MCH కిట్స్ లను, న్యూట్రిషన్ కిట్లను అర్హులైన వారికి సరైన సమయంలో సరఫరా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

TSMSIDC ద్వారా చేపడుతున్న ఆస్పత్రుల బిల్డింగ్ నిర్మాణ పనులు వేగంగా… అనుకున్న సమయానికి పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో TSMSIDC మేనేజింగ్ డైరెక్టర్ R V కణ్ణన్, ED కౌటిల్య, CE రాజేంద్ర కుమార్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest