సాంకేతికంగా ఓడిపోయా… నైతికంగా నేనె గెలిచా: రాకేష్ రెడ్డి

 

హైదరాబాద్ :

పట్టభద్రుల ఉప ఎన్నికలో సాంకేతికంగా ఓడిపోయినా నైతికంగా తానే గెలిచానని బి ఆర్ ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు.
మొత్తం కాంగ్రెస్ ఎంఎల్ఏ లు, మంత్రులు, ఎంపిలు ఉండి కాంగ్రెస్ హవా ఉన్నా ప్రతి రౌండ్ లో గట్టి పోటీ ఇచ్చాను.
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోటాను చేరుకోకుండ కట్టడి చేయగలిగాను.శాసనమందలి లో అడుగు పెట్టకున్న జన సభలో 365 రోజులు పోరాటం చేస్తా.. ప్రశ్నిస్తా.. ప్రజా గోoతుకగా ఉంటా.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసిన వారిలో రెండో ప్రాధాన్యత ఓట్లు నాకు వేశారు.
అధికార యంత్రాంగం, ఆ పార్టీ అంతా అటు వైపు ఉంటే.. నేను, నా పార్టీ మాత్రమే ఇటు వైపు ఉన్నాం. నేను గెలవాలని కోరుకున్న వారి ఆశలు చేరలేక పోయాను. వారందరూ నన్ను క్షమించాలి.JD లక్ష్మినారాయణ లాంటి వ్యక్తి నన్ను ప్రోత్సహించారు.BRS లో చేరిన తర్వాత దేశంలోనే అతి పెద్ద పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ లకు ధన్యవాదములు.
మూడు జిల్లాల BRS నాయకులు అంతా సపోర్ట్ చేశారు.GO no-46 మీద పోరాటం చేస్తా.ఓటమి అనుభవంతో ప్రజా పోరాటంలో ముందుకు పోతాను అని రాకేష్ రెడ్డి చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest