DR BR అంబేద్కర్ విగ్రహావిష్కరణ- ట్రాఫిక్ అంక్షలు

హైదరాబాద్:

– రేపు మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 8గంటల వరకు వాహనాల దారి మళ్లింపు
– నెక్సెస్ రోడ్డు, ఖైరతాబాద్, లకిడీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ అంక్షలు

– నెక్లెస్ రోడ్డు – ఎన్టీఆర్ మార్గ్ – తెలుగుతల్లి జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ

– పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలు షాదన్ కళాశాల మీదుగా దారి మళ్లింపు..
– సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా తరలింపు
– లకిడీకపూల్ నుంచి ట్యాంకుబండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లింపు
– ట్యాంక్ బండ్, బీఆర్కె భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లకిడీకపూల్ వైపు మళ్లింపు
– మింట్ కౌంపౌండ్, నెక్లెస్ రోటరీ మార్గాల మూసివేత
– ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులు మూసివేత
– ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశం
– ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
– హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియాను అనుసరించాలని సూచిస్తున్న పోలీసులు
– ఏదైనా అత్యవసరం ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు ఫోన్ చేయాలని సూచిస్తున్న పోలీసులు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest