హైదరాబాద్ :
అకాలవర్షం, వడగళ్ల వానతో వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలోని 13 గ్రామాలలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం జరిగింది. వికారాబాద్ జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. ఇక్కడ పంట నష్టం బాగానే జరిగినట్టు సర్కారు ప్రాథమికంగా సమాచారం తెప్పించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖా మంత్రి వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మామిడి, గులాబీ, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి ఉద్యాన, కొంతమేర మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ప్రత్యక్షంగా పంటనష్టం తీవ్రతను పరిశీలించి రైతులకు భరోసా కల్పించనున్నారు.
Post Views: 212