జగిత్యాల రూరల్:
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారిక కార్యక్రమాలకు కూడా కరెంట్ కోతలు తప్పడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కల్యాణలక్ష్మీ చెక్కులను పంచుతుండగా సడెన్‌గా కరెంటు పోయింది. దీంతో దాదాపు 40 నిమిషాల పాటు లబ్ధిదారులతో పాటు అధికారులు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అధికారిక కార్యక్రమంలో కరెంట్ కట్.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాల్ చేసిన స్పందించని అధికారులు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారిక కార్యక్రమాలకు కూడా కరెంట్ కోతలు తప్పడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కల్యాణలక్ష్మీ చెక్కులను పంచుతుండగా సడెన్‌గా కరెంటు పోయింది. దీంతో దాదాపు 40 నిమిషాల పాటు లబ్ధిదారులతో పాటు అధికారులు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
శనివారం ఉదయం జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 303 మంది కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ దావ వసంత అక్కడికి చేరుకున్నారు. లబ్ధిదారులు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో చేరుకోగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతల తీవ్రత ఎంతగా ఉన్నదో ప్రభుత్వ విప్‌తో పాటు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి సైతం ఈ కార్యక్రమంతో తెలియవచ్చింది. సమావేశం ప్రారంభం సమయం వరకు కరెంట్ లేకపోవడంతో తహసీల్దార్ విద్యుత్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. అయినా కరెంట్ అధికారులు సరిగ్గా స్పందించలేదు. విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వయంగా కల్పించుకొని పలుమార్లు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి కరెంట్ సరఫరాను పునరుద్ధరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయినా కరెంట్ అధికారుల నుంచి సరైన స్పందన లభించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కరెంట్ లేకుండానే, ఉక్కపోతలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 40 నిమిషాల తర్వాత పునరుద్ధరించడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటిదాకా ప్రతి ఒక్కరూ ఉక్కపోతతో తీవ్రఅవస్థకు గురయ్యారు.