అమరవీరులకు నివాళ్లర్పించిహిన లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్

 

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదించే సమయంలో లోక్ సభ లో స్పీకర్ గా ఉన్న మీరా కుమార్ సరిగ్గా తెలంగాణ ఏర్పడిన దశాబ్ది ఉత్సవాలకు హైదరాబాద్ కు వచ్చారు. కాంగ్రెస్ నాయకులతో కలసి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళ్ళపించారు. దామోదర్ రాజా నరసింహ , మహేష్ కుమార్ గౌడ్ ఇతర కాంగ్రెస్ నేతలు మీరా కుమార్ వెంట ఉన్నారు.

ఈ సందర్బంగా గాంధీ భవన్ లో జరిగిన సభ లో మీరా కుమార్ మాట్లాడారు. వేదికపై జై తెలంగాణ నినాదాలు ఇచ్చిన మీరా కుమార్. జై తెలంగాణ అని గట్టిగా నినదిద్దాం.నాకు తెలుగులో మాట్లాడాలని ఉంది.తెలుగు భాష చాలా అందంగా ఉంటుంది.మా నాన్న ఇక్కడికి వచ్చేవారు. అప్పటి నుండే నాకు తెలుగుతో అనుబంధం ఉంది.తెలంగాణ ప్రజల బాధ అర్థం చేసుకున్న సోనియాకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేశారు. తెలంగాణ సమస్య ఎవరు వినలేదు. సోనియా మాత్రం తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్నారు.ఈ వేదికపై విప్లవకారులు కూర్చున్నందుకు ఈ వేదిక వెలిగిపోతోంది.తెలంగాణ ప్రజల బాధలు చూసి రాష్ట్ర ఏర్పాటు చేశాం.రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ ఏర్పాటు చేశాం.రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది అనడం హాస్యాస్పదం.తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచినందుకు సంతోషంగా ఉంది.తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితులు మారనందుకు దుఖంగా ఉంది.తెలంగాణ రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయి.హైదరాబాద్ నుండి కాస్త పక్కకి వెళ్లి చూస్తే తెలంగాణలో ఉన్న పరిస్థితులు తెలుస్తాయి.తెలంగాణలో పరిస్థితులు చూసి సోనియా, రాహుల్ బాధ పడుతున్నారు.తెలంగాణ బాధలు మార్చడానికి కాంగ్రెస్ కృషి చేస్తుంది.తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి.అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలనేది కాంగ్రెస్ ఆలోచన.మీరు ఎప్పుడు పిలిచినా ఒక కాల్ చేయగానే నేను తెలంగాణకి వచ్చేస్తా.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest