అమెజాన్ ప్రైమ్‌, ఆహా లో ‘లక్కీ లక్ష్మణ్’

 

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా థియేటర్స్‌లో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే ఇప్పుడీ సినిమా ఆడియెన్స్‌కు మ‌రింత చేరువ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ‌లు అమెజాన్ ప్రైమ్‌, ఆహాల్లో మ‌హా శివ రాత్రి సంద‌ర్భంగా స్ట్రీమింగ్ అవుతుంది.

దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన యువ‌కుడు ల‌క్ష్మ‌ణ్ (స‌య్య‌ద్ సోహైల్‌). తండ్రి (దేవీ ప్ర‌సాద్‌) ఆర్థిక ప‌రిస్థితి అస్స‌లు బాగోదు. త‌ను ఏది అడిగినా కొనివ్వ‌లేడు. దీంతో ల‌క్ష్మ‌ణ్‌లో తెలియ‌ని అసంతృప్తి ఉంటుంది. ఇంజ‌నీరింగ్ చ‌దివే స‌మ‌యంలో శ్రియ (మోక్ష‌)తో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. తండ్రిపై ఉన్న కోపంతో ఇంట్లో నుంచి ల‌క్ష్మ‌ణ్ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. ల‌క్ష్మ‌ణ్ ఆర్థిక ప‌రిస్థితి తెలిసిన శ్రేయ అత‌నికి సాయం చేస్తుంటుంది. స్నేహితుల సాయంతో సొంతంగా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసిన ల‌క్ష్మ‌ణ్ అందులో బాగా డ‌బ్బులు సంపాదిస్తాడు. డబులున్నాయ‌నే పొగ‌రుతో ప్రేమ‌ను కాద‌నుకుంటాడు. తల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోడు. అయితే అనుకోకుండా ఓరోజు తండ్రి స్నేహితుడు క‌న‌ప‌డి.. ఆయ‌న గొప్ప‌త‌నాన్ని, త‌న కోసం చేసిన త్యాగాన్ని తెలుసుకుని షాక‌వుతాడు. వారికి ద‌గ్గ‌ర‌వుతాడు. హీరోకి, త‌న తండ్రికి ఉన్న ఎమోష‌న‌ల్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. తండ్రి కొడుకు కోసం చేసే త్యాగాల‌ను గుర్తుకు చేసి హృద‌యాల‌ను బ‌రువెక్కేలా చేస్తాయి.

తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే ఎమోష‌న‌ల్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌న‌టంలో సందేహం లేదు. కాబ‌ట్టి ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ చిత్రాన్ని ఈ శివ‌రాత్రికి మీ అభిమాని అమెజాన్ ప్రైమ్‌, ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి..

న‌టీన‌టులు:
స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష‌, దేవీ ప్ర‌సాద్‌, రాజా ర‌వీంద్ర‌, స‌మీర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, షాని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, నిర్మాత‌: హ‌రిత గోగినేని, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్‌.అభి, మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఐ.అండ్రూ, ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ పూడి, పాట‌లు: భాస్క‌ర‌భ‌ట్ల‌, కొరియోగ్ర‌ఫీ: విశాల్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌యానంద్ కీత‌, పి.ఆర్‌.ఒ: నాయుడు – ఫ‌ణి (బియాండ్ మీడియా)

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest