అమరావతి :
ఆలులేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెత ఇలాంటి వాళ్ళ వల్లే పుట్టిందేమో అనిపిస్తోంది. ఒక్కసారి ఈ ప్రకటన చూడండి . ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆడపిల్లలు కలలు కనాలట. వారి కలలకు తెలుగుదేశం, జనసేన అండగా నిలుస్తారట. అసలు ఆంధ్రలో ఎన్నికలే జరగలేదు. ఎన్నికలు జరిగితే ..చంద్రబాబు వస్తారా, జగన్ వస్తాడా ఇంకా తెలనేలేదు.. ఇప్పుడే తెలుగుదేశం, జనసేన కలిసి సంయుక్త ప్రకటన. దానికి ఓ వెబ్ సైట్ కూడా. 2014 ఎన్నికల సమయంలోనూ ”జాబు రావాలంటే బాబు రావాలి” అని ప్రచారం చేయారు. 2014లో నిజంగానే బాబు అధికారంలోకి వచ్చాడు. మరి ఎన్ని జాబులు ఇచ్చాడు? ఇప్పుడు మళ్ళీ యువతుల ఓట్లు, మహిళల ఓట్లు కోసం తెలుగుదేశం, జనసేన కలిసి వేసిన ఎత్తుగడ లాగే ఉంది ఈ ప్రకటన కూడా.
దేశంలో తొలి విప్లవాత్మకమైన పథకం ఈ కలలకు రెక్కలు. మన ఆడబిడ్డల కలల చదువుల సాకారానికి, బ్యాంకు రుణాలకు ప్రభుత్వమే హామీదారు మరియు కోర్సు వ్యవధిలో ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. ఇందుకోసం https://kalalakurekkalu.com వెబ్సైటు క్లిక్ చేసి రిజిష్టర్ చేసుకోండి. ఈ పోస్టర్ ను సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తున్నారు.