- టర్కీ బాధితులకు సాయం
టర్కీ :
ప్రతికూల పరిస్థితుల్లో, చీకటిలోనూ శత్రు దేశాల భూభాగంలోకి నిర్దేశిత సమయంలో చేరుకునే విషయంలో భారత సైన్యం విజయం సాధించింది. సుదూరానికి కూడా సమాచార మార్పిడి చేసే మాడ్యూళ్లతో రూపొందించిన సంచార్ మొబైల్ అప్లికేషన్‌తో ఈ ఘనతను సాధించింది. తద్వారా అన్ని వేళ్లలోనూ భారత సైన్యం సన్నద్ధత మరింత ఇనుమడించింది.
యుద్ధక్షేత్రంలోనూ,ప్రత్యర్థి భూభాగాల్లో సైన్యం నిర్వహించే ఆపరేషన్లకు కీలకమైన అంశం సమాచార మార్పిడి. ప్రాణాలకు తెగించి పోరాటం సాగించే క్లిష్టమైన కార్యకలాపాల్లో బలగాల మధ్య సమన్వయంతో కూడిన సమాచార బదిలీ అత్యవసరం. శత్రుభూభాగాల్లో పోరాడేటపుడు ఇది మరీ ముఖ్యం. అయితే సుదూరంగా ఉండే బలగాలకు సమాచారం అందించడం కష్టం.
ఈ సమస్యను భారత సైన్యం సంచార్ అనుసంధాన వ్యవస్థ కెప్టెన్ కరన్ సింగ్ ఆయన అనుచర బృందం రియల్‌టైమ్‌లో సందేశాలను పంపే, ట్రాకింగ్ చేసే మాడ్యూళ్లతో “సంచార్” స్వతంత్ర నెటవర్క్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థకు సుదూర శ్రేణి సమాచారం చేరే వేసే మ్యాడ్యూళ్ల అనుసంధానత LoRAను జోడించారు. తద్వారా యుద్ధం క్షేత్రంలో సైనికులు ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేయడం సహా వారికి రియల్ టైమ్‌లో సందేశాలను చేరవేసే అవకాశం కలిగింది.ప్రతికూల వాతావరణం, చీకటిలోనూ అవసరమైన చోట దిగేందుకు ఎయిర్‌బోర్న్ సైనిక బలగాలకు సంచార్ వరంలా మారింది. పారాచూట్‌ల సాయంతో గాల్లో నుంచి నేలపైకి దిగి సైనిక ఆపరేషన్లు నిర్వహించే ఎయిర్‌బోర్న్ బలగాలకు పరస్పర సమాచార మార్పిడికి సంచార్ ఎంతో బాగా ఉపకరిస్తోంది. విపత్తుల సమయంలోనూ ఇది ఉపయోగకరంగా మారింది. సంచార్ స్వంతంత్ర మొబైల్ అప్లికేషన్ ద్వారా ఎయిర్ బోర్న్ బలగాలు తమ కసరత్తును విజయవంతంగా నిర్వహించాయి. తమ ఆపరేషన్ విజయవంతమైందని వెల్లడించాయి.
గతంలో యుద్ధక్షేత్రంలో పోరాడే బలగాలకు సందేశం అందించడం, వారు ఎక్కడున్నారో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. పూర్తి అంతర్గత నెట్‌వర్క్‌తో రూపొందించిన ‘సంచార్ అప్లికేషన్’ ద్వారా ఈ సమస్యను సైనికబలగాలు అధిగమించాయి. ప్రస్తుతం ఇదే అప్లికేషన్‌ను తుర్కియే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత బలగాలు ఉపయోగిస్తున్నాయి. అనేక మంది ప్రాణాలను రక్షిస్తున్నాయి.