ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలు:మల్లికార్జున ఖర్గే

న్యూ ఢిల్లీ (5 మే 2024) : దేశ రాజకీయాల్లో అనేక మార్పులు రావొచ్చు. ఒకేరోజు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి భేటీ ఢిల్లీలో జరిగింది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొన్ని ఆయా కూటముల్లో కొత్త కొత్త పార్టీలు కూడా చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు ప్రచారం జోరందుకుంది.

ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఖర్గే నివాసంలో కూటమి పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ… ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్నారు. నైతికంగా ప్రధాని ఓడిపోయారన్నారు. తమ కూటమిలోకి కొత్త పార్టీలు రావొచ్చునని ఆహ్వానించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా పోరాడిందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావొచ్చునన్నారు. ఈ ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ మోదీ ప్రజల అభీష్టాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest