మహబూబాబాద్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… సంచలన వ్యాఖ్యలు
దారిపొడవునా ఎవరిని కదిలించినా వారికి దుఃఖం పొంగుకొస్తోంది.బీఆరెస్ ను వందమీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని ఆవేశంగా చెబుతున్నారు.మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే బాగుపడతామని మా ఆడబిడ్డలు చెప్పారు.ఆర్టీసీ కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.నీరంకుశ పాలనలో తమను వేధిస్తున్నారని ఆవేదనగా చెబుతున్నారు.ఆర్టీసీలో 6200 బస్సులుంటే 3200 బస్సులు ప్రయివేటువే. 50వేల మంది చేసే పనిని 40వేల మందితో వెట్టి చాకిరి చేయిస్తున్నారు.ఒకటో తారీఖున వచ్చే జీతాలు.. 8 వ తేదీ వచ్చినా రాలేదని కంట తడి పెట్టారు.అవకాశం వచ్చిన రోజు కేసీఆర్ సర్కారుకు కర్రు కాల్చి వాత పెడతామని కండక్టర్ శ్రీలత ఆవేదనగా చెప్పింది.రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు.వృద్దులకు పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదని వాళ్లు గోడు వెళ్లబోసుకుంటున్నారు.ఇందిరమ్మ ఇచ్చిన పోడు భూములను హరితహారం పేరుతో గుంజుకుంటున్నారు.ఈ ఊర్లో ఒక దుశ్యాసన ఎమ్మెల్యే ఉన్నాడు.ఆ దుశ్యాసనుడు కలెక్టరమ్మ చేయిపట్టి లాగాడు.మెడికల్ కాలేజీ పేరుతో పేదల భూములు గుంజుకున్నాడు.పేదల భూములను కుటుంబ సభ్యుల పేర్లతో రాయించుకున్నారని చెబుతున్నారు.ఇక్కడ రాక్షస పాలన సాగుతోంది.కలెక్టర్లకు, కౌన్సిలర్లకు, పోడు భూములకు , పేదలకు ఇక్కడ రక్షణ లేదు.నకిలీ విత్తనాలతో మిర్చి రైతులను మోసం చేసిన వారిపై పీడీ వ్యక్తులు ఎందుకు పెట్టరు?అప్పుల బాధతో 29 మంది రైతులు పురుగుల మందు తాగి చనిపోయారు.ఈ దుర్మార్గాలకు, పాపాలకు కారణం కేసీఆర్ అని ప్రజలు నా దృష్టికి తెచ్చారు.జనవరి 1, 2024 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది.2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు పట్టాలిస్తాం.వారి ఆత్మ గౌరవాన్ని నిలబెడతాం.భూ నిర్వాసితులందరికి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది.చనిపోయిన 50మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్ కు తగులుతుంది.40వేల ఆర్టీసీ కార్మికులను చూసుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది.పోలీసులకు ప్రతీ వారం సెలవు ఇచ్చి.. ప్రతీ నెల1వ తేదీన జీతాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది.హోమ్ గార్డుల సమస్యలు తీరుస్తాం.మహబూబాబాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.తొమ్మిదేళ్లయినా ఆ హామీని నిలబెట్టుకోలేదు.ములుగులో నా వ్యాఖ్యలపై బీఆరెస్ నేతలు పోలీసులకు పిర్యాదు చేశారట.రాజ్యాలను కూల్చి రాచరికాన్ని బొంద పెట్టిన చరిత్ర తెలంగాణది.రాష్ట్రంలో పాలన చూస్తుంటే రజాకార్లు మళ్లీ వచ్చినట్లు ఉంది.ఎక్కడ దోపీడీలు, కబ్జాలు జరిగినా అక్కడ బీఆరెస్ నేతలున్నారు.బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు నిర్మించలేదు?ఇన్ని అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ ను, ఆయన సామంత రాజు శంకర్ నాయక్ ను శంకరగిరి మాన్యాలకు తరిమే బాధ్యత మీపై ఉంది.కేసీఆర్ కాదు.. కింద పనిచేసే కుక్కలు వచ్చినా.. నెత్తి మీద కాలు పెట్టి తొక్కి.. పాతాళానికి పంపిస్తాం.ప్రగతి భవన్ లోపలికి పేదలకు ఎందుకు ప్రవేశం లేదు?అందుకే చెప్పా. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామని.కేసీఆర్ గుర్తు పెట్టుకో బిడ్డా….కొత్త ఏడాదిలో ప్రగతి భవన్ గడీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం.