ఇరాన్ అధ్యక్షుడు రైసి ఇక లేరు-హెలి క్యాప్టర్ ప్రమాదంలో మృతి

  • ఇరాన్ అధ్యక్షుడితో సహా విదేశాంగ మంత్రి కూడా మృతి
  • ఇరాన్ తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ లో ప్రమాదం
  • దేశంలో ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు అధికారం చేపట్టిన రైసి

ఇరాన్ :
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి కన్ను మూశారు. హెలి క్యాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు ఇరాన్ కు చెందిన రాష్ట్ర టీవీ పేర్కొంది. ప్రెసిడెంట్ రైసి హెలి క్యాప్టర్ నుంచి ప్రాణాలతో వస్తున్నట్టు ఎలాంటి సంకేతాలు లేవని రాష్ట్ర టీవీ తెలిపింది. ఈ ప్రమాదంలో హెలి క్యాప్టర్ పూర్తిగా దగ్దామైనదని, ఈ ప్రమాదంలో రైసి కూడా కన్నుమూశారని తెలిపింది. రైసి 2021లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు, అణుఒప్పందం పునరుద్ధరణ వంటి సవాళ్ళను ఎదుర్కొనే సమయంలో ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు. 14 డిసెంబర్ 1960లో ఆయన జన్మించారు.ఈ హెలి క్యాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి హుసేని అమిరాబ్దోలోహియాన్ కూడా ఉన్నారు. ఇరాన్ లోని తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ లో హెలి క్యాప్టర్ ప్రమాదానికి గురి అయినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest