ఈ నెల 19, 24వ తేదీల్లో వరంగల్ జిల్లాకి సీఎం రేవంత్ రెడ్డి.

వరంగల్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19, 24 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించ నున్నారు. 19న హెలీకాప్టర్ లో మహబూబాబాద్ చేరుకుంటారు. స్థానిక ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ వేయనున్నారు. 24న హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest