ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి:సీతక్క సూచన

హైదరాబాద్:

పార్లమెంట్ ఎన్నికలు ప్రచారంలో భాగంగా అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని జై నూరు మండలంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క రాష్ట్ర ప్రజల కోసం ఎండాకాలంలో ప్రజల జాగ్రత్తలు, సూచన సూచిస్తూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉదయం 9 గంటల నుంచే
భానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు అని కూలీ పనులకు వెళ్ళే వారు త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవాలని కోరారు ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ప్రజలంతా మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పెరగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్న పిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు పాటించాలని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆవసరమైతెనే ఇండ్ల నుంచి బయటకు రావాలని లేక పోతే రావద్దని మంత్రి సూచించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest