ఏంరా సంపత్, గట్లజేష్నవ్, నా పోంటిను ముందటికేవోతలేదు!

 

ఏంరా సంపత్, గట్లజేష్నవ్! చల్ గిదేనార సోపతి.. రెండు శానల్లల్ల కల్సి పన్జేశినం, గిదేనార నీ వఫాదారి! అన్నాలం కాక గిది! ఓ తొందరున్నట్టు 48 ఏండ్లకే సాలిచ్చుకొనివోతివి! మొన్న 15 ఒద్దుల కింద పట్నంల ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్ల గలిసినప్పుడుగూడ ఒకమాట జెప్పకపోతివి! ఆడికి పీక్కపోయిన నీ మొఖం జూసి అరేయ్ ఏందిరా నీ యవ్వారం, పానమెట్లున్నదని నేనడ్గనే అడ్గితి! యే కాక గవన్నెందుకిప్పుడు సానొద్దులకు గలిసినం మనం, ఏమన్న వేరే ముచ్చటజెప్పరాదే అంటివి! సరే, పానమైతే సక్కగజూస్కొ అని నేనంటిని! యే నాకేమైందే ఫస్ట్ క్లాసున్న అంటివి! ఇప్పుడెందిరా గిట్ల పాగల్గానిలెక్క జేష్నవ్!

గా దినం డబ్బదెచ్చుకొని, మాతోని అన్నం గూడదింటివి! గదే ఆఖరి సూపాయే మనకు! ఏందిరా కాక గిది. సరేతియ్, ఉన్నన్ని రోజులు అందరితోని నియ్యత్గనే ఉన్నవ్, నువ్వు జన్నత్కేవోతవని నా భరోస! నువ్వొయిన కాడ నీ నియ్యత్ పనికస్తది, అక్కన్నన్న నువ్వు జర తెరిపివడ్తానికి ఆసరైతది! శానా రాద్దామనుకున్నగని, నా పోంటిను గీడనే ఆగిపోతుంది! ఇక ఉంటా, సెలవు కాక!

సూరజ్ వి. భరద్వాజ్.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest