ఏపీలో జిందాల్‌ స్టీల్‌ భారీ పెట్టుబడులు

 

జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌

విశాఖపట్నం :

విశాఖలో​ జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జరుగుతోంది. ఈ సందర్బంగా ఏపీలో పెట్టుబడులపై వివిధ కంపెనీలు తన పెట్టుబడులను ప్రకటించారు. జిందాల్‌ కంపెనీ రానున్న రోజుల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొంది. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌ మాట్లాడుతూ ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయి. ఏపీలో పారిశ్రామిక అనుకూల వాతావరణం భేష్‌. ఏపీలో ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్‌ ఉంది. 10వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి కల్పించబోతున్నట్టు తెలిపారు. ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందన్నారు.

ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది

జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు

జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు మాట్లాడుతూ ఏపీలో ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్‌ ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌ దార్శనికత ప్రశంసనీయం. సీఎం జగన్‌ విజన్‌ అద్భుతం. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎయిర్‌ కనెక్టివిటీ పెరుగుతుండటంతో ఏపీకి మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయమని అన్నారు.

ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం

సియాంట్‌ చైర్మన్‌ బీవీ మోహన్‌ రెడ్డి

సియాంట్‌ చైర్మన్‌ బీవీ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ విశాఖలో మా కంపెనీలకు మరింత విస్తరిస్తాం. ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం. విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం. పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి జరుగుతోందన్నారు.

నైపుణ్యానికి ఏపీ చేస్తున్న కృషి అభినందనీయం

భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్లా

భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ ప్రపంచానికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోందన్నారు. నైపుణ్యానికి ఏపీ చేస్తున్న కృషి అభినందనీయం. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest