అమరావతి:
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం ఆయన ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ సీఎస్‌గా ఉన్న కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఆయన జూన్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.
Post Views: 48