ఐపీఎల్ -2024 విజేత కోల్ కత్తా నైట్ రైడర్స్-IPL 2024 Winner KOLKATTA

  • ఐపీఎల్ లోనే అతి తక్కువ స్కోర్ చేసిన మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్
  • ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచిన కోల్ కత్తా నైట్ రైడర్స్
  • స్టేడియంలో చిందులు వేసిన షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులు

చెన్నై :

ఐపీఎల్ 2024 ముగిసింది. చెన్నై లోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ఐపీఎల్ ఆటకు ముగింపు పడింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ -2024 విజేతగా నిలిచింది. ప్రత్యర్థి సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించింది. పదేళ్ల తరువాత కోల్ కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబడింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ మొదటి బాల్ నుంచే హైదరాబాద్ బ్యాట్ మెన్స్ ను చిత్తు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ చేసిన ఫైనల్ మ్యాచ్ ఇదే అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి నుంచే చతికిలబడ్డారు. 113 పరులకే పరిమితమైయ్యారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్లు విజృంభణను హైదరాబాద్ బ్యాట్స్ మేన్స్ తట్టుకోలేకపోయారు. దీంతో 114 పరుగులు కోల్ కత్తా టీమ్ అవలీలగా చేధించింది. ఈ సీజన్ మొత్తం ప్రతి మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగినప్పట్టికీ ఫైనల్ మ్యాచ్ మాత్రం ఏకపక్షంగా సాగింది. హైదరాబాద్ బ్యాట్స్ మేన్స్ ను ఎక్కడ మీసాలనియ్యకుండా కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్లు కట్టడి చేశారు. హైదరాబాద్ పై కోల్ కత్తా సునాయాసంగా విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో కోల్ కత్తా విన్నర్ గా నిలిచింది. 18. 3 ఓవర్లలో కేవలం 113 పరుగులు చేసిన హైదరాబాద్ టీమ్ ఆల్ అవుట్ అయింది. హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ (0) డక్కవుట్ అయ్యారు. అభిషేక్ శర్మ (2) , రాహుల్ త్రిపాఠి (9), నితీష్ రెడ్డి (13), అదెలా మార్క్రం (20), షాబ్స్ అహ్మద్ (8), అబ్దుల్ సమద్ (4), కెప్టెన్ పాట్ కమిన్స్ 24 పరుగులతో టీమ్ మొత్తం మీద టాప్ స్కోరర్ గా నిలిచారు.

114 పరుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ అవలీలగా కొట్టేసింది. ఓపెనర్ సరైన్ (6) పరుగులకే అవుట్ అయ్యారు. మరో ఓపెనర్ గర్భాజ్ 39 బంతుల్లో 31 పరుగులు చేశారు. వెంకటేష్ అయ్యర్ మాత్రం బాదుడు మొదలు పెట్టాడు. 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసిన ఘనత వెంకటేష్ అయ్యర్ కు దక్కుతుందని చెప్పవచ్చు. మరో బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ 6 పరులు చేసి నాటౌట్ గా నిలిచారు. దీంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ కేవలం 10. 3 ఓవర్లలోనే విజయ తీరాన్ని చేరింది. కోల్ కత్తా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. కో కత్తా మొదటి సారి 2012 లో ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచింది. 2014 లో కూడా ఐపీఎల్ విన్నర్ గా నిలిచినా కోల్ కత్తా ఇప్పుడు 2024 ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest