కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ కలెక్టర్ గా షేక్ యస్మిన్ బాషా
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత స్థాయి అధికారుల బదిలీలు తెగ జరుగుతున్నాయి. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఈ బదిలీలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. డీజీపీ కొత్తగా రావడం, ప్రధాన కార్యదర్శి కూడా కొత్త వ్యక్తి రావడంతో ఇతరాధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఐ పీ ఎస్ అధికారుల బదిలీలు జరుగగా, మంగళవారం కలెక్టర్ల బదిలీలు జరిగాయి. 21 మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్.కమిషనర్, సీసీఎల్ఏగా కూడా నవీన్ మిట్టల్ కు అదనపు బాధ్యతల అప్పగింత.ఈ మేరకు జీవో 153 జారీ.
Post Views: 223