గుంటూరు :
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఎన్‌సీసీ 22 ఆంధ్ర బెటాలియన్ వార్షిక శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరం కమాండెంట్ కల్నల్ జే.మహేష్ మాట్లాడుతూ, శిక్షణ శిబిరం ద్వారా ఎన్‌సి సి క్యాడెట్లకు పూర్తిగా ఆర్.డిసి, టిఎస్సీ లాంటి జాతీయ శిక్షణ శిబిరాలకు పంపడానికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతిరోజు గన్ ఫైరింగ్, వాల్ క్లైటింగ్, డ్రిల్, క్రీడలు, ఆయుధాల వాడకం, మ్యాప్ రీడింగ్, గార్ట్ ఆఫ్ హానర్, రాజ్యపత్, కర్తవ్యఫత్ లాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ శిబిరానికి గుంటూరు జిల్లా నుండి మొత్తం 700 మంది ఎన్‌సిసి క్యాడెట్లు హాజరైనట్లు పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా ప్రతిరోజు ఎన్.డి.ఆర్.ఎఫ్, ప్రధమ చికిత్సల గురించి వివరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వర్శిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారధివర్మ, ప్రో వైస్ చాన్సులర్లు డాక్టర్ ఎవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, డాక్టర్ కుర్రా రాజశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగ డీన్ డాక్టర్ కె.ఆర్.ఎస్.ప్రసాద్, సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, కెఎల్‌యూ ఎన్‌సిసి 22 ఆంధ్ర ఎన్సిసి ఆఫీసర్ లెఫ్టినెంట్ వి.మౌనిక, డిప్యూటీ కమాండర్ లెఫ్టినెంట్ గణేష్, సుబేదార్ డేజర్ మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.