గాజువాక ప్రజాగళం బహిరంగ సభ చంద్రబాబు ప్రసంగం

గాజువాక ప్రజాగళం బహిరంగ సభ

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు  ప్రసంగం:-

నేను నేరాలు చేయను…నేరాలు చేసేవాళ్లను తుంగలో తొక్కేస్తా…
– ముఖ్యమంత్రి రోడ్డు షోలో కరెంటు పోవడం ఏంటి? డ్రామా కాకపోతే..
– చీకట్లో జగన్ పై గులకరాయి వేస్తే…నాపై వెలుగులో రాయి విసిరారు
– రాష్ట్రం ఏమైనా జగన్, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డివాళ్ల అబ్బ జాగీరా?
– వైసీపీ ప్రభుత్వం ఓ డ్రామ కంపెనీ అని ప్రజలు గుర్తించాలి
– విశాఖను వైసీపీ నాయకులు డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చారు
– ఉత్తరాంధ్రకు పరిశ్రమలు, కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తా
– భావితరాల భవిష్యత్తు నా బాధ్యత
– కోడి గుడ్డు మంత్రి అనకాపల్లిని ఊడ్చేసి..నేడు గాజువాక వచ్చాడు
– గాజువాక ప్రజలు కోడిగుడ్డును పగలుకొట్టి ఆమ్లెట్ వేయాలి

• గాజువాక ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయం అని అర్థమవుతుంది.
• ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి  భరత్ ను మీరు ఆశీర్వదించి చట్ట సభలకు పంపాలి.
• వైసీపీ అధికారంలోకి వచ్చాక పల్లా శ్రీనివాస్ ను ఇబ్బంది పెట్టాలని ఆయన కట్టిన కాంప్లెక్స్ కూల్చారు..అయినా ఎక్కడా తగ్గకుండా ప్రజల కోసం పోరాడుతున్నారు.
•  భరత్ కు చెందిన కేఎల్‌యూ బిల్డింగ్ లను సైతం కూల్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.
• కేఎల్‌యూ గొప్పతనం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం తెలియదు.
• పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, ఏపీలో ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సంకల్పించిన గొప్ప వ్యక్తి.
• గాజువాక ప్రాంతంలోని జనసైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు.
• గాజువాక ప్రాంతంలోని బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు.
• భారతదేశానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ.
• 2047 నాటికి ప్రపంచ పటంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.
• టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడింది కేవలం ప్రజల కోసమే…మా ఆలోచన ఒక్కటే..ప్రజలు నిలబడాలి..రాష్ట్రం నిలబడాలి.
• మావి మూడు జెండాలు…కానీ అజెండా ఒక్కటే..మా లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ.
• ఇప్పటికే నేను ప్రజాగళంలో 34 మీటింగులు పూర్తిచేసి, గాజువాకలో 35వ మీటింగ్ పెట్టాను.
• రాష్ట్ర ప్రజలంతా నెత్తిమీద పెట్టుకున్న కుంపటిని దించుకోవాలని చూస్తున్నారు.
• వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది ఎన్డీయే కూటమే…ప్రజల భవిష్యత్తును ఉజ్వలంగా చేయడమే మా లక్ష్యం.
• ఉత్తరాంధ్ర అంటే నాకు చాలా అభిమానం…ఈ ప్రాంతం ప్రజలు చాలా మంచివారు.
• సమైఖ్య ఏపీలో ఉత్తరాంధ్రలో విశాఖను ఆర్థిక రాజధానిగా, ఇండస్ట్రియల్ హబ్ గా, ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకున్నాను.
• హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి ముందుగా వచ్చిన వ్యక్తిని నేను.
• హుద్ హుద్ ఎంత వేగంగా వచ్చిందో…అంత వేగంగా నేను ఇక్కడికి వచ్చాను.
• 10రోజులు ఇక్కడే బస్సులో పడుకుని విశాఖ ప్రాంతాన్ని చక్కదిద్దాక నేను ఇంటికి వెళ్లాను. మీ మీద ఉన్న ప్రేమ, అభిమానం నన్ను ఇక్కడ నిలబెట్టింది.
• 2019లో రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయినా…విశాఖలో టీడీపీ గెలిచింది.
• విశాఖపట్నంలో ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలను కూటమి అభ్యర్థులే గెలుస్తున్నారు.
• విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, ఏ సదస్సు పెట్టినా విశాఖలోనే నిర్వహించాం.
• విశాఖను టూరిజం, ఐటీ హబ్ గా, పరిశ్రమల కేంద్రంగా ఇక్కడ అభివృద్ధి చేశాం…మెడ్ టెక్ జోన్ గా విశాఖను తీర్చిదిద్దాం.
• మెడికల్ రంగానికి చెందిన వస్తువుల తయారీ విశాఖలోనే తయారయ్యేలా కంపెనీలు, పరిశ్రమలు తెచ్చాం.
• విశాఖలో ఐఐఎం, ఇతర విద్యాకేంద్రాలు తెచ్చాం.
• ఇలాంటి విశాఖను వైసీపీ నాయకులు వచ్చాక గంజాయి కేంద్రంగా మార్చారు.
• ఇటీవల కాలంలో విశాఖపట్నం పోర్టులో 25వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది..దీనికి సంబంధించిన దోషి వైసీపీ ప్రభుత్వం.
• ప్రభుత్వ సహకారం లేకుండా విశాఖపట్నం పోర్టుకు ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ దిగుమతి అవుతాయా?
• ఏపీలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారని ప్రభుత్వంపై నేను పోరాడితే..టీడీపీ పార్టీ ఆఫీసుపై వైసీపీ నాయకులు దాడి చేశారు.
• నేను 2రోజులు నిరవధిక నిరాహాద దీక్ష చేసి పోరాడాను..సమస్యను ఢిల్లీ స్థాయికి తీసుకెల్లి కేంద్రం పెద్దలకు మెమొరాండం ఇచ్చి పోరాడాను.
• గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకోకుండా…ప్రశ్నించిన వారిపై కక్షపూరిత చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోంది.
• నేను ముఖ్యమంత్రిగా ఉంటే గంజాయి, డ్రగ్స్ అమ్ముకునే వారిని అణిచివేసేవాడిని…వాళ్లకు అదే చివరిరోజు అయ్యేది.
• వైసీపీ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం…చేతకాని ప్రభుత్వం.
• ఇక్కడికి గంజాయి, బ్లేడ్ బ్యాచ్ వచ్చి రాళ్లు విసురుతున్నారు. రాళ్లు విసిరిన వారిని ప్రజలు వదిలిపెట్టరు..తరిమి తరిమి కొడతారు. పోలీసులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ విషయంలో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు.
• చిల్లర చిల్లర వేషాలు వేస్తే ప్రజలు బట్టలు విప్పి తరిమి తరిమి కొడతారు. జగన్మోహన్ రెడ్డి తన జే గ్యాంగ్ ను అదుపు చేసుకోవాలని హెచ్చరిస్తున్నా…
• నేడు తెనాలిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే వారాహి పైకి జే గ్యాంగ్ రాళ్లు విసిరారు.
• నేను గతంలో విశాఖకు వస్తే..నన్ను వైసీపీ గూండాలు అడ్డుకుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. నన్ను విశాఖ నుండి వెనక్కి పంపించేశారు.
• నేను అమరావతి వెళితే ఆ సమయంలో వైసీపీ గూండాలు నాపైకి చెప్పులు, రాళ్లు, కర్రలు విసిరారు.
• ఆ సమయంలో జే గ్యాంగ్ చర్యలను డీజీపీ సిగ్గులేకుండా సమర్థించారు.
• వైసీపీ ఎమ్మెల్యే నా ఇంటి మీదకు తన గ్యాంగ్ తో రాళ్లు, కర్రలతో వస్తే..పోలీసులు దాన్ని కూడా సమర్థించారు. చివరకు ఆ ఎమ్మెల్యే నా అపాయింట్మెంట్ కోసం వచ్చాడని వెనకేసుకొచ్చారు.
• క్లెయిమోర్ మైన్ లకే భయపడని నేను ఈ రాళ్లకు, కర్రలకు, చెప్పులకు భయపడతానా?
• విజయవాడలో నిన్న ముఖ్యమంత్రి కార్యక్రమంలో కరెంటు పోయింది..కరెంటు పోవడానికి నేను కారణం అంటున్నారు. అసలు ప్రభుత్వం ఎవరిది? కరెంటు ఎవరి చేతుల్లో ఉంటుంది? ముఖ్యమంత్రి గా ఈ మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా? కరెంటు పోవడానికి ఎవరిది బాధ్యత?
• గతంలో ఓసారి కోడికత్తి డ్రామా ఆడాడు..గొడ్డలి వేటుతో బాబాయ్ ను చంపి ఆ నేరాన్ని నాపై మోపడానికి ప్రయత్నం చేశాడు.
• జగన్మోహన్ రెడ్డిని తన చెల్లెలు వివేకా హత్య గురించి అడుగుతోంది సమాధానం చెప్పాలి..
• వివేకాను చంపిన వాడికి ఎంపీ పదవి ఇచ్చాడు, వైసీపీ కి రాష్ట్ర ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు..వైసీపీ పార్టీ పూర్తిగా రక్తపు మరకలతో తడిచిపోయి ఉందని జగన్మోహన్ రెడ్డిని తన చెల్లెలు ప్రశ్నిస్తోంది.
• నేను నేరాలు చేయను..నేరాలు చేసేవాడిని వదిలిపెట్టను…తుంగలో తొక్కేస్తాను…
• ఇన్ని రోజులు నాపై దాడులు చేశారు..గతంలో పవన్ కళ్యాణ్ పై దాడులు చేశారు.
• గతంలో విశాఖపట్నం విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ను వైసీపీ రౌడీలు అడ్డుకున్నారు. కారులో హోటల్ కు వెళితే ఆ హోటల్ నుండి 24గంటల్లో విశాఖ వదిలిపెట్టాలని పోలీసులు హుకుం జారీ చేశారు.
• పోలీసులు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని రెచ్చిపోయారు…ఈ విశాఖ మీ తాతజాగీరా జగన్మోహన్ రెడ్డి? ఈ విశాఖ రాష్ట్ర ప్రజలది.
• ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు నేను విజయవాడలో కలిసి ధైర్యం చెప్పాను..ఉన్మాది ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని చెప్పాను.
• పోలీసులు కూడా ఉన్మాది జగన్మోహన్ రెడ్డి మాటలు విని మనసు చంపుకుని, ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేశారు.
• నన్ను అరెస్టు చేసిన సమయంలో మొట్టమొదటిసారిగా స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్.
• నిన్న ముఖ్యమంత్రిపై చీకట్లో పడింది ఓ చిన్న గులకరాయి…కానీ నేను ఇప్పుడు మాట్లాడుతుంటే వెలుగులో నాపైకి విసిరారు ఓ పెద్ద రాయి…
• ముఖ్యమంత్రి పర్యటిస్తుంటే కరెంటు ఉండదా? ఏంటి ఈ డ్రామాలు? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు. నేను 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆవిలిస్తే నీ పేగులు లెక్కపెడతా…నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి?
• జగన్మోహన్ రెడ్డి కి కార్యక్రమాలకు జనం రావడం లేదు..రారు…రాష్ట్ర ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి బాధితులే..నేను కూడా బాధితుడినే…విశాఖ ప్రజలు బాధితులే…పల్లా శ్రీనివాస్, శ్రీ భరత్, గాజువాక ప్రజలంతా బాధితులే.
• ఈ ప్రాంతంలో రాధిక అనే మహిళ భూమికి సంబంధించిన సమస్యను వైసీపీ నాయకుడు సుభాష్ దృష్టికి తీసుకెళ్తే డబ్బులు ఇస్తే చేస్తానని చెప్పాడు. డబ్బులు తీసుకుని ఆ మహిళ భూమిని కొట్టేయాలని చూస్తే రాధిక అడ్డుపడిందనే కోపంతో పెట్రోల్ పోసి చంపేయాలని చూశాడు. వైసీపీ గూండాల్లారా ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా…
• బెదిరిస్తే ప్రజలు ఎవరూ భయపడరు…బెదిరిస్తే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు..ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు వైసీపీ నేతలను తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
• ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది…కేవలం నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులే కాదు మాతో ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడడంలో భాగస్వామ్యం కావాలి.
• ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలబడాలి..ఉన్మాది నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి..పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలి…ఇప్పటికే జగన్ రూ.13లక్షల కోట్ల అప్పులు చేశాడు.
• జగన్ పదే పదే బట్ నొక్కాను అని అంటున్నాడు..బటన్ ఎక్కడ నొక్కాడో అర్థం కావడం లేదు.
• గత 5ఏళ్లుగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రాలేదు.
• జగన్ విశాఖ వస్తే స్కూళ్లు, కాలేజీలు అన్నిటికీ సెలవు…దారిలో చెట్లు అన్నీ నరికేయాలి…ఇష్టం లేకున్నా ప్రజలు జగన్ సభలకు రావాలి…సభలకు రాకపోతే పెన్షన్, రేషన్ కట్ చేస్తున్నారు. నేడు విశాఖ ప్రజలంతా జగన్ పవర్ కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
• జగన్మోహన్ రెడ్డి అనే భస్మాసురుడిని ప్రజలు నమ్మితే…ప్రజల నెత్తిమీదే చెయ్యి పెట్టాడు.
• రాష్ట్ర ప్రజలకు ఓటే వజ్రాయుధం..ఈ వజ్రాయుధంతో మే 13న భస్మాసుర వధ జరగాలి…దానికి మీరంతా సిద్ధంగా ఉండాలి.
• వైసీపీ పాలనలో ఆదాయం తగ్గింది…ఖర్చులు పెరిగాయి.
• నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలో, డీజిల్, పప్పులు, బియ్యం, నూనెల ధరలు పెరిగాయి.
• ఇవీ చాలనట్లు విశాఖలో ఆస్తిపన్ను ప్రతి సంవత్సరం పెంచుతున్నారు.
• నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదు.
• కరెంటు తక్కువుగా ఉన్న సమయంలో కూడా 24గంటలూ కరెంటు ఇచ్చాను.
• వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్న సమయంలో కూడా కరెంటు పోయే పరిస్థితి వచ్చింది.
• కరెంటు బిల్లు వైసీపీ పాలనలో 5రెట్లు పెరిగింది. దీనికి కారణం ముఖ్యమంత్రి అసమర్థతనం. ఇది అడిగితే మనపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను మనం క్షమించాలా? ముఖ్యమంత్రికి ప్రజలకు జవాబుదారీతనం లేదా?
• జగన్మోహన్ రెడ్డిని జవాబు అడిగితే పులివెందుల పంచాయతీలు చేస్తున్నాడు…పులివెందులది గొడ్డలి పంచాయతీలు.
• పులివెందుల గొడ్డలి పంచాయతీలు విశాఖపట్నంలో మీకు కావాలా?
• వైసీపీ ఫ్యాను అరిగిపోయింది…తిరిగే పరిస్థితి లేదు..రాష్ట్ర ప్రజలు ఫ్యానును రానున్న ఎన్నికల్లో ముక్కలు ముక్కలుగా విరగొట్టి చెత్తబుట్టలో వేస్తారు..నీ ఎన్నికల గుర్తును గొడ్డలిగా మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డికి నేను చెబుతున్నాను.
• 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ఇంటింటికీ వచ్చాడు…ఆ సమయంలో నేను పాదయాత్రకు అవకాశం ఇవ్వకపోతే పాదయాత్ర చేసేవాడా?
• పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి నెత్తిన చేతులు పెట్టాడు..బుగ్గలను నిమిరాడు..అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దుతున్నాడు.
• ఐదేళ్లుగా జగన్ కొట్టే దెబ్బలు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
• వైసీపీ పాలనలో వెనుకబడిన వర్గాలేవీ బాగుపడలేదు.
• తెలుగుదేశంపార్టీ బడుగు, బలహీన వర్గాల పార్టీ…ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల తరపున ఉంటాం..బీసీ డిక్లరేషన్ ఇచ్చాం…జయహో బీసీ అనేది టీడీపీ విధానం.
• బీసీలకు అండగా నిలుస్తాం..సంవత్సరానికి బీసీల అభ్యున్నతికి బడ్జెట్లో రూ.30వేల కోట్ల బడ్జెట్…ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్ల బడ్జెట్ తో బీసీలను అన్ని విధాలా ప్రోత్సహిస్తాం..అభివృద్ధి పథంలో నడిపిస్తాం.
• 50ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తాం..సంవత్సరానికి వెయ్యి కోట్లు…ఐదేళ్లకు రూ.5వేల కోట్లు బడ్జెట్ పెట్టి ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందిస్తాం. కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తాం. వెనుకబడిన వర్గాలకు పూర్వవైభవాన్ని తీసుకొస్తాం.
• స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం.
• వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ జరుగుతోంది…
• గతంలో ఇసుక రేట్లకు.. ఇప్పటి రేట్లకు 5రెట్లు తేడా ఉంది. వైసీపీ పాలనలో ఇసుక రేట్లు విపరీతంగా పెరిగింది.
• మద్యం రేట్లను ఇష్టానుసారం పెంచేశారు.
• టీడీపీ పాలనలో క్వార్టర్ మద్యం ధర రూ.60 ఉంటే నేడు వైసీపీ ప్రభుత్వం రూ.200లకు అమ్ముతున్నారు.
• ప్రభుత్వ మద్యం షాపుల్లో ఆన్ లైన్ పేమెంట్లు తీసుకోవడం లేదు…ఒక్కో సీసాపై రూ.140 తాడేపల్లి ప్యాలెస్ కు పోతోంది.
• నాశిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముకుంటూ దోచుకుంటున్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. వ్యవస్థలను విధ్వంసం చేశారు.
• గాజువాక ప్రాంతంలో గత ఐదేళ్లలో చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా నిర్వహించలేదు.
• మీ అందరికీ హామీ ఇస్తున్నా…భవిష్యత్తులో మీ అందరినీ ఆదుకుంటాం..అభివృద్ధి చేస్తాం.
• నేను ఇక్కడికి ఎవరినీ విమర్శించడానికి రాలేదు…కేవలం మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి వచ్చాను.
• తెలుగుదేశంపార్టీ, భారతీయజనతాపార్టీలకు అభివృద్ధి చేయడం తెలుసు..
• దేశంలో సంపద సృష్టించడంలో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ…కానీ ఏపీ అన్ని విధాలా నష్టపోయింది.
• 40ఏళ్లుగా మీరు నన్ను ప్రత్యేకంగా అభిమానించారు..ఉమ్మడి ఏపీలో అత్యధికకాలం ముఖ్యమంత్రిగా నన్ను మీరు ఆశీర్వదించారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా అవకాశం ఇచ్చారు.
• కానీ నేను ప్రతి క్షణం రాష్ట్రం గురించి ఆలోచించాను..నా వల్ల రాష్ట్రం బాగుపడాలి…ప్రజలకు న్యాయం చేయాలి…యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి..రైతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచించి పని చేశాను.
• సంపద సృష్టించాలనే ఆలోచనతో ముందుకెళ్లాను..అందుకే విశాఖ, హైదరాబాద్ నగరాల్లో ఉద్యోగాలు సృష్టించి యువతకు ఉద్యోగాలు ఇచ్చాను.
• హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోకి పోయింది…మనకు ఆదాయ వనరు పోయింది.
• ఏపీకి మరో హైదరాబాద్ లాంటి నగరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం ప్రారంభించాను..నదులను అనుసంధానం చేశాను. రూ.16లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాను. 2029నాటికి దేశంలోనే ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా చేయాలని చూశాను. మోడీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు, నేను ఏపీని అభివృద్ధి చేయాలని చూశాను. తెలుగుజాతి రుణం తీర్చుకోవాలని ప్రయత్నం చేశాను.
• 2019లో ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయ్యాడు..ప్రజావేదికను కూల్చడంతో పరిపాలన ప్రారంభించాడు. విధ్వంసంతో ముందుకు వెల్లాడు. మాట్లాడితే ప్రొక్లెయినర్లు పంపించాడు..ఇంకా మాట్లాడితే జైలుకు పంపాడు…వేధించాడు.
• 14ఏళ్లు ముఖ్యమంత్రి పనిచేసిన నాపైనే లెక్కలేనన్ని కేసులు పెట్టాడు.
• నా నామినేషన్ కోసం డీజీపీకి కేసులు జాబితా ఇవ్వాలని లెటర్ పెడితే..నేటికీ సమాధానం లేదు. నాపై ఏ పోలీసు స్టేషన్ లో ఎన్నికేసులు పెట్టారో తెలియదు.


• ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేసులు పెట్టిస్తూ ప్రభుత్వం వేధిస్తోంది..
• నాకే ఇలాంటి పరిస్థితి ఉంటే..మీలాంటి సామాన్యులు తట్టుకోగలరా?
• ప్రజల కోసం నేను నిలబడినందుకు జగన్ నన్ను జైలుకు పంపాడు…జగన్ వేధింపులకు భయపడి 40ఏళ్లు నన్ను ఆశీర్వదించిన ప్రజలను వదిలి దాక్కోవాలా? ఇది జరగని పని.
• అందుకే మీకోసం నేను నిలబడ్డా..నిలదొక్కుకున్నా…40ఏళ్లు నన్ను గౌరవించిన ప్రజల కోసం రాష్ట్రాన్ని గాడిలో పెట్టి, అన్ని రాష్ట్రాలతో ఏపీని గాడిలో పెట్టి, తెలుగువాడు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే నా కర్తవ్యం అని ప్రతిజ్ఞ చేసుకున్నాను.
• అందుకే ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు కదులుతున్నాను.
• నిన్న ముఖ్యమంత్రి సంఘటనను నేను ఖండించాను. ప్రధానమంత్రి కూడా ఖండించారు. ఘటనపై అందరం స్పందించాలని చూశాము.
• సంఘటన జరిగిన అరగంటలోనే జగన్మోహన్ రెడ్డి నాకు వ్యతిరేకంగా ప్లేకార్డులు తెచ్చి నాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.
• కొన్ని పేటీఎం కుక్కలు ఇష్టానుసారం మొరుగుతూనే ఉన్నాయి..
• కరెంటు తీసి..నీపై గులకరాయి వేయించడానికి నాకేం పని జగన్?
• నీ పోలీసులు…నీ కరెంటు డిపార్ట్మెంట్ అధికారులను నీ చేతిలో పెట్టుకుని నాపై పడి ఏడ్వడం ఏంటి?
• నీకు ముఖ్యమంత్రిగా పనిచేయడం చేతకాకపోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యి…ఒక్కగంటలో కరెంటును ఎలా గాడిలో పెట్టాలో తెలిసిన వాడిని..నాకు ఆ సత్తా ఉంది. చేసి చూపించిన ట్రాక్ రికార్డు నాకు ఉంది.
• నీ బాబాయ్ ను నువ్వే చంపి..నాపై నేరారోపణ చేసి ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవాలని చూసిన దుర్మార్గుడివి నువ్వు జగన్..
• చెల్లెలిపై అక్రమ కేసులు పెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.
• కోడికత్తి డ్రామా ఆడి..కోడి కత్తిని నేను ఉపయోగించానని అర్థరహితంగా మాట్లాడారు.
• నిన్న ఎవరో గులకరాయి వేస్తే…దాన్ని నాపై నెడుతున్నారు…దాన్ని సాకుగా చూపి నాపై రాళ్లు వేయిస్తున్నారు.
• బాంబులు వేస్తేనే నేను భయపడలేదు…ఈ రాళ్లకు భయపడతానా? తప్పుడు పనులు చేయొద్దు అని హెచ్చరిస్తున్నాను.
• పవన్ కళ్యాణ్ పై , నాపై రాళ్లువేస్తే…ప్రధానమంత్రి కార్యక్రమంలో మైక్ లు కట్ చేస్తే మేం భయపడం.
• ప్రధానమంత్రి ఏపీకి వచ్చి మాట్లాడుతుంటే మైక్ లు పనిచేయలేదు..దీనిపై నేను, ప్రధాని అప్పీల్ చేస్తే పట్టించుకోలేదు.
• కొంత మంది టవర్లు ఎక్కితే ప్రధాని అప్పీల్ చేసి దిగేలా చేశారు..మీ ప్రాణాలు ముఖ్యం అని ప్రజలకు చెప్పారు.
• ప్రధాని సభలో పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. పోలీసులకు నేను అప్పీల్ చేస్తే కనీసం పట్టించుకోలేదు. మా కార్యక్రమాన్ని ఫెయిల్ చేస్తే మేం భయపడతామని అనుకున్నారు. ప్రధాని మాట ప్రజలు వినకూడదనేలా వ్యవహరించారు. అలా వ్యవహరించి పోలీసులపై నేటికీ చర్యలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.
• ముఖ్యమంత్రి కార్యక్రమం సమయంలో కరెంటు తీసేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముఖ్యమంత్రిపై గులకరాయి వేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 24గంటలైనా పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? దీనిపై సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా? నాపై దాడి చేయిస్తూ రాక్షసానందం పొందాలని చూస్తున్నారా?
• ఓ ఎంపీని అక్రమంగా అరెస్టు చేయించి..ఇష్టమొచ్చినట్లు కొట్టించి..వీడియో తీయించి..ఆ వీడియో చూసి ముఖ్యమంత్రి రాక్షసానందం పొందాడు.
• ముఖ్యమంత్రిపై గులకరాయి పడితే కొంపలు కూలినట్లు అరుస్తున్నారు..గులకరాయి వేయడాన్ని నేను సమర్థించడం లేదు.
• రాష్ట్ర ప్రజలకు కోపం వచ్చినప్పుడు రేపు రానున్న ఎన్నికల సమయంలో ఈవీఎం దగ్గరకు వెళ్లి మీకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుని ఓటు వేయండి..వైసీపీని ఓడించి ఫ్యానును ముక్కలు ముక్కలు చేయండి. రాష్ట్రానికి పట్టిని పీడ వదిలిపోతుంది.
• వైసీపీని ఓడించడం నాకోసమో…మా మూడు పార్టీల కోసమో కాదు…రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజల కోసమే ప్రాధేయపడుతున్నాను.
• దాడులు చేస్తూ చూస్తూ ఊరుకునేందుకేనా పోలీసు వ్యవస్థ ఉన్నది?
• వైసీపీ ప్రభుత్వం రౌడీయిజాన్ని ప్రజలు ఎవరూ ఊరుకోవద్దు…
• రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవాలని ఉంది…నన్ను 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో చేసిన అభివృద్ధిని 5ఏళ్లలో చేసి చూపించాలని నాలో కసి పెరిగిపోయింది. మీ రుణం తీర్చుకుంటాను. అందుకే మూడు పార్టీలు ఒక్కటయ్యాం.
• బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీలో ఎవరూ తక్కువ కాదు..మేం నిలబడతాం…మిమ్మల్ని నిలబెడతాం.
• కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది…మనం కూడా ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం.
• సంపద సృష్టిస్తాం…ఆదాయాన్ని పెంచుతాం..యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం..స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం…ఖర్చులు తగ్గించి…ఆదాయాన్ని పెంచి మెరుగైన జీవితాన్ని అందిస్తాం. ఆ బాధ్యత మాది.
• ఆడబిడ్డ నిధి అనే కార్యక్రమాన్ని మనం ప్రకటించాం…బీజేపీ నేడు నారీ శక్తి అనే పథకాన్ని ప్రకటించింది.
• ఆడబిడ్డ నిధి కార్యక్రమం ద్వారా 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 అందిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉన్నా అందిస్తాం.
• దీపం పథకం ద్వారా వంట గ్యాస్ ఇచ్చిన ఘనత టీడీపీది.
• విశాఖలో కొన్ని వేల పట్టాలు ఇవ్వకుండా పెండింగ్ పెడితే పసుపు, కుంకుమ పథకం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా పట్టాలు ఇచ్చాం.
• మహిళల కోసం ఉచితంగా మరుగుదొడ్లు కట్టించాం..
• ఆస్తిలో మహిళలకు సమాన హక్కు ఇచ్చిన ఘనత టీడీపీది.
• ప్రధాని ఇచ్చిన ఇళ్లను టిడ్కో ఇళ్లుగా కట్టించి 12లక్షల ఇళ్లను ప్రారంభించిన పార్టీ టీడీపీ.
• ఏ ఒక్కరికీ ఇల్లు లేదనకుండా కేంద్రం సహకారంతో ఇళ్లు కట్టించే బాధ్యతను మేం తీసుకుంటాం.
• జగన్ పాలనలో ఇచ్చిన ఏ పట్టాను మేం రద్దు చేయం..నిర్మాణ దశలో ఆగిపోయిన ఇళ్లను పూర్తిచేయడానికి సహకరిస్తాం.
• టీడీపీ పాలనలో స్థలాలు లేని వారికి 2సెంట్లు ఇళ్ల స్థలాలు అందిస్తాం.
• తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు అందిస్తాం..మీ రుణం తీర్చుకుంటాం.
• సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తాం..ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.
• మహిళలను లక్షాధికారులను చేయాలని ఓ పథకాన్ని ప్రకటించింది. దాన్ని మనం ఉపయోగించుకుంటూ మహిళలకు పథకాలు అందిస్తాం.
• రాష్ట్ర యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
• విశాఖకు మిలీనియం టవర్, ఐటీ కంపెనీలు తెచ్చాం.
• రానున్న కాలంలో విశాఖకు పరిశ్రమలు తెస్తాం..చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తాం…విశాఖలో వర్క్ ఫ్రం హోం విధానాన్ని తీసుకొస్తాం.
• విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రజలంతా విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని అందుకున్నారు.
• విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ముందుకు రావాలని, ముఖ్యమంత్రికి నేను కూడా సహకరిస్తానని చెబితే ముఖ్యమంత్రి ముందుకు రాలేదు..నేను ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి ఓట్లు అడుగుతాడు?
• నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో, వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తానని చెబితే వాజ్ పేయీని మెప్పించి, ఒప్పించి ప్రైవేటీకరణ కాకుండా ఆపించాను.
• రాజశేఖర్ రెడ్డి కంటే ముందు నేను ముఖ్యమంత్రిగా పనిచేశానని జగన్మోహన్ రెడ్డి మరచిపోతున్నాడు.
• గాజువాకలో పల్లా శ్రీనివాస్ ను, విశాఖ ఎంపీగా శ్రీభరత్ ను గెలిపించండి…విశాఖను ప్రైవేటీకరణ కాకుండా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం మేం చేస్తాం.
• పేదవారందరికీ పెన్షన్ ను రూ.4వేలకు పెంచుతాం..పెన్షన్లపై ముఖ్యమంత్రి శవ రాజకీయాలు చేశాడు. మేం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్ నుండే రూ.4వేల పెన్షన్ ఇస్తానని నేను సవాల్ చేస్తే ముఖ్యమంత్రి నోరు మూసేశాడు.
• జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి…జూలై నెలలో పెన్షన్ బకాయిలన్నీ విడుదల చేస్తా.
• వలంటీర్లను తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని వైసీపీ పురిగొల్పింది..ఆ సమయంలో నేను వలంటీర్లకు రూ.5వేల నుండి రూ.10వేల వేతనం పెంచుతానని చెప్పాను. వలంటీర్లు బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పాను. వలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ చేసి రూ.10వేలు సంపాదించే వాళ్లను లక్షలు సంపాదించేవాళ్లుగా చేస్తానని హామీ ఇచ్చాను.
• జగన్మోహన్ రెడ్డి వలంటీర్లను జీవితాంతం బానిసలుగా చేసుకుని నేరాలు, ఘోరాలు చేయించాలని చూశాడు.
• కానీ వలంటీర్లు కూడా గౌరవంగా బ్రతకాలనేది నా అభిమతం..వలంటీర్లు..వారి కుటుంబాలు ఆత్మగౌరవంతో బ్రతకాలనేది నా ఆలోచన. ఆ మేరకు పనిచేస్తాను.
• టీడీపీ, జనసేన, బీజేపీ లకు ధీటుగా ఎమ్మార్పీఎస్ కూడా వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
• 1996లో ఏబీసీడీ క్యాటగిరీ పెట్టాను..దీనిపై ప్రధాని కూడా ముందుకు వచ్చారు..రానున్న కాలంలో ఎస్సీల్లో ఏబీసీడీ క్యాటగిరీలను జిల్లాలవారీగా అమలు చేస్తాం.
• గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇక్కడి ప్రజలను ఎన్ని తిప్పలు పెట్టాడో తెలియదు..ఎంత సంపాదించాడో తెలియదు. అన్నీ చేశాడు..కానీ నేడు అతని వసూళ్లన్నీ ఆగిపోయాయి. అతని గ్రాఫ్ రేట్ పడిపోయిందని ఇక్కడికి కోడిగుడ్డు మంత్రిని తీసుకొచ్చారు.
• పరిశ్రమలు ఎక్కడున్నాయి మంత్రి అని అడిగితే కోడి, గుడ్డు..కోడి గుడ్డును పాదగాలి అని చెబుతున్నాడు.
• ఈ కోడి గుడ్డును పగలకొట్టి ఆమ్లెట్ వేసి బుద్ధి చెప్పాలి.
• ఈ కోడి గుడ్డు మంత్రి ఓ కార్పొరేటర్ గా నా దగ్గర పెరిగాడు..నన్ను ఎన్ని తిట్లు తిట్టాడో..పవన్ కళ్యాణ్ ను కూడా ఇష్టానుసారం తిట్టాడు.
• ఎదుటి వ్యక్తులను ఆ కులాలకు చెందిన వ్యక్తులతో తిట్టించి శునకానందం పొందుతున్నాడు జగన్మోహన్ రెడ్డి.
• కోడిగుడ్డు మంత్రి అనకాపల్లిని ఊడ్చేసి ఇక్కడికి వచ్చాడు.
• ముఖ్యమంత్రిని దావోస్ ఎందుకు వెళ్లలేదు అని అడిగితే చలి అని కబుర్లు చెబుతున్నాడు.
• నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9సార్లు దావోస్ వెళ్లాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ లో ఏపీ ఓ బ్రాండ్ గా ఉండేది.
• మేం అధికారంలోకి వచ్చాక అనగంపూడి టోల్ గేట్ ను ఎత్తేస్తాం…దిబ్బపాలెం-గంగవరం మత్స్యకారుల కోసం యారాడలో జెట్టీలు నిర్మిస్తాం.
• పోర్టు సమీప ప్రాంతాలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరిస్తాం.
• డ్వాక్రా మహిళలను అన్ని విధాలా ఆదుకుంటాం.
• ఉడా కాలనీలో క్రీడా కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తాం.
• గాజువాక అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.
• టీడీపీకి పటిష్టమైన కాయకర్తలు ఉన్న ప్రాంతం గాజువాక. వీళ్లకు జనసైనికులు, బీజేపీ కార్యకర్తలు కలిశారు.
• ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి తిరుగే లేదు..గెలుస్తామని నాయకులు ఇళ్లలో కూర్చోవడం మంచిది కాదు.
• అత్యంత మెజార్టీతో గెలవడం చాలా ముఖ్యం అని ప్రతి అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి.
• మూడు పార్టీల కార్యకర్తలు మీ ప్రాంతంలో కూటమి అభ్యర్థులను మీ సొంత పార్టీ అభ్యర్థిగా భావించి గెలిపించుకోవాలి. ఈ క్రమంలో బాగా కష్టపడిన వారికి ప్రత్యేకమైన గుర్తింపునిస్తాం.
• రాజకీయాల్లో కష్టపడేవారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవిస్తాం…మీ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం.
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ డ్రామా కంపెనీ అని రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకోవాలి.
• జగన్ పై గులకరాయి పడితే మేం ఖండించాం…కానీ పవన్ కళ్యాణ్ పై రాళ్ల దాడి జరిగితే కనీసం ముఖ్యమంత్రి ఖండిచలేదు.
• జగన్ పై గులకరాయి పడిన 15నిమిషాల్లో వైసీపీ గ్యాంగ్ ప్లేకార్డులతో నిరసన తెలిపారు. ఇది ఎలా సాధ్యమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇది డ్రామా కాదా?
• జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్ది రెడ్డి మీ అబ్బ సొత్తా, మీ అబ్బ జాగీరా ఈ రాష్ట్రం?
• మేం బానిసలం అనుకుంటున్నారా? మేం బానిసలం కాదు..తెలుగుజాతి వారసులం..నీచులపై పోరాడుతాం, బుద్ధి చెబుతామని మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను.
• భావితరాల భవిష్యత్తును తీర్చి దిద్దాలని ప్రజలను నన్ను కోరుతున్నారు..అందుకే మీకోసం నేను నిలబడి పోరాడుతున్నాను.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest