గీత వృత్తి ఆధునీకరణ పై దృష్టి సారించాలి

  • గీత వృత్తి లో కార్మికుల మరణాలను, ప్రమాదాలను తక్షణమే నివారించాలి.
  • ప్రపంచం లోనే మెరుగైన ‘సులభతరమైన సేఫ్టీ యంత్రాలను’ గీత కార్మికులకు అందించాలి.
  • గీత వృత్తి సాంప్రదాయ పద్ధతిలో కొనసాగడం వల్ల ప్రమాదవశాత్తు మరణాలు సంభవిస్తున్నాయి.
  • గీత కార్మికుల కు సేఫ్టీ యంత్రాలను తక్షణమే అందించేందుకు అవసరమైన కార్యచరణను రూపొందించాలి .
  • సీఎం కేసీఆర్  ఆదేశాల మేరకు కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాం.
  • రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులకు ఆదేశం.

హైదరాబాద్

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సాంప్రదాయ బద్ధంగా.. అనాదిగా గీత కార్మికులు తమ వృత్తిని కొనసాగిస్తూ..తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి వందలాది మంది మృత్యువాత, శాశ్వత అంగ వైకల్యం బారిన పడుతున్న గీత కార్మికుల మరణాలను, ప్రమాదాలను తక్షణమే నివారించేందుకు ప్రపంచం లోనే మెరుగైన ‘సులభతరమైన సేఫ్టీ యంత్రాలను’ పైలట్ ప్రాజెక్టు కింద అందించేందుకు వెంటనే నివేదిక ను సమర్పించాలని మంత్రి ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రం లో గీత వృత్తిలో భాగంగా గీత కార్మికులు ఎన్నో వందల ఏళ్ల నుండి సాంప్రదాయ బద్ధంగా తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడి వందలాది, వేలాది మంది గీత కార్మికులు ఇప్పటికే మరణించారని, చాలామంది గీత కార్మికులు శాశ్వత అంగ వైకల్యం చెందినా వారి వారి కుటుంబాలు గీత వృత్తిలో భాగమై జీవిస్తున్నారన్నారు. ప్రపంచంలో అనేక వృత్తులలో ఆధునికత సంతరించుకున్నప్పటికీ గీత వృత్తి మాత్రం అదే సాంప్రదాయ పద్ధతిలో కొనసాగడం వల్ల ప్రమాదవశాత్తు మరణాలు సంభవిస్తున్నాయని మంత్రి అవేదన చెందారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్  ఆధ్వర్యంలో అనేక వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారన్నారు.. అలాగే, గీత వృత్తిని ప్రోత్సహించడం కోసం వృత్తిని ఆధునికరించే క్రమంలో గీత కార్మికులకు సులభతరమైన, ఆధునిక సాంకేతిక పరంగా ప్రపంచంలోనే ఉత్తమమైన సేఫ్టీ యంత్రాలను తక్షణమే అందించేందుకు అవసరమైన కార్యచరణను రూపొందించాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ సహాయ కమిషనర్ చంద్రయ్య గౌడ్ లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest