- గ్రామ స్థాయి వరకు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- వార్డు, గ్రామ, మండల కమిటీలను నియామకం పూర్తి చేయండి
- కార్యక్రమ పర్యవేక్షకులకు పార్టీ శ్రేణులు సహకరించాలి
- పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ లో తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
హైదరాబాద్
త్వరలో ప్రారంభించనున్న “ఇంటింటి టీడీపీ” కార్యక్రమాన్ని గ్రామ, వార్డు స్థాయి వరకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని పార్టీ నాయకులను ,శ్రేణులను తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశించారు.
మంగళవారం ఎన్టీఆర్ భవన్ నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ వివిధ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఇంటీంటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి టీడీపీ కరపత్రాలను పంపిణీ, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గ్రామ, వార్డు, మండల, డివిజన్ స్థాయిలలో అన్ని కమిటీలను పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నుంచి మండలాలు, డివిజన్లకు “ఇంటింటి టీడీపీ” కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అబ్జర్వర్లను నియామకం చేస్తామన్నారు. ఈ బాధ్యతలను స్వీకరించిన వారు తమకు కేటాయించిన మండలాలు, డివిజన్లలలో నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకొని కార్యక్రమన్ని విజయవంతం చేయాలని సూచించారు. అబ్జర్వర్లకు పూర్తి స్థాయిలో శ్రేణులు సహకరించి పార్టీ క్రమశిక్షణకు లోబడి నడుచుకోవాలన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలను కిట్ల ద్వారా 1300 మండలాలు, డివిజన్లకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇటీవల ఎన్టీఆర్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయా జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణుల బయోడెటాలను పరిశీలించి వారి వ్యక్తిగత వివరాలను ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ అడిగి తెలుసుకున్నారు.
Post Views: 205