చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యం మహా భాగ్యం

 

—రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మెన్ మారుమూడి విక్టర్ ప్రసాద్

కృష్ణా విశ్వవిద్యాలయం ( మచిలీపట్నం ) : 29 ,
ఫిబ్రవరి, 2024

చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యం మహా భాగ్యం అవుతుందని, దాంతో పాటు క్రమశిక్షణ జీవితం, వ్యాయమం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మెన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు.

గురువారం కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణం రవీంద్రనాధ్ టాగోర్ ఆడిటోరియంలో ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యములో అను గ్రూప్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ కు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని వైద్య శిభిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ జీవితంలో విద్య, వైద్యం, నివాసం ఎంతో ప్రాముఖ్యమైనవన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని గమనించాలన్నారు. యువత చేదు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మహిళల పట్ల మర్యాదగా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు. మంచి ప్రవర్తనతో కన్నవారికి, విద్యను బోధించే ప్రొఫెసర్లకు, యూనివెర్సిటీకు మంచి పేరు తీసుకురావాలన్నారు. క్రీడలు ఆడటం ద్వారా చక్కని దేహారోగ్యం పెంపొందించుకోవాలని సూచించారు.నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడం ద్వారా ఎంతో ఉన్నతమైన స్థానానికి తప్పక చేరుకోవచ్చన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జగన్ ప్రభుత్వం తీసుకొన్న ఒక విప్లవత్మకమైన నిర్ణయం అని ఎస్సి కమీషన్ ఛైర్మెన్ కొనియాడారు. అలాగే పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య సురక్ష కార్డులు జారీ చేసి ప్రజారోగ్యంకు ఎంతో ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి భూమి లేని పేదలకు ఇళ్ల స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మించడం ద్వారా సొంతింటి కల ఆయన నెరవేర్చారన్నారు. కృష్ణా యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యములో మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మెన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ఆకాక్షించారు.

అనంతరం కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి. జ్ఞానమణి ప్రసంగిస్తూ, 1600 వందల మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ క్యాంపస్ లో విద్య ను అభ్యసిస్తుంటే ఇక్కడ ఆసుపత్రి సౌకర్యం లేని విషయాన్ని గుర్తించిన తానూ డి ఎం డి హెచ్ ఓ దృష్టికి తీసుకువెళ్ళానని వెనువెంటనే స్టాఫ్ నర్స్ ను నియమించి వారంలో ఒక రోజు, ప్రముఖ వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని వైస్ ఛాన్సలర్ జ్ఞానమణి ప్రశంసించారు

ఎన్ ఎస్ ఎస్ సమన్వయకర్త డా ఎం శ్రావణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రధాన ఆచార్యులు ఆచార్య సుందర కృష్ణా, పరిశోధనా విభాగం సమన్వయకర్త డా ఎన్ ఉషా, చిలకలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్, అను గ్రూప్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ మంజుశ్రీ డాక్టర్ వై . గోవర్ధిని, డాక్టర్ మాన్య, డాక్టర్ రమ్య కృష్ణ తదితరులు వివిధ ఆరోగ్య అంశాలపై ప్రసంగించారు. తొలుత మెగా వైద్య శిబిరం ను ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు స్వరూపా, రవి, సేషా రెడ్డి, గోపి, కవిత, సుజయ్, శాంతి కృపా, ప్రయివేట్, టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ భట్టు శ్యామ్ ప్రసాద్ , యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest