దళితులకు రక్షణ కరవు – జంతర్ మంతర్ లో DSMM ధర్నా

న్యూ ఢిల్లీ :
దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులకు రక్షణ లేకుండా పోయిందని దళిత్ శోషన్ ముక్తి మంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నాకు దిగారు. ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియర్న్ ( AIAWU) తో కలిసి దళిత్ శోషన్ ముక్తి మంచ్ (DSMM) ఆందోళన చేపట్టారు. ఏ ఐ ఏ డబ్ల్యు యూ జనరల్ సెక్రెటరీ బి.వెంకట్, డీ ఎస్ ఎం ఎం సెక్రెటరీ నాథు ప్రసాద్ మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని వారు దుయ్యబట్టారు. దినసరి కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా జీవితాన్ని గడుపుతున్న దళితుల బడ్జెట్ లో కేంద్రం కొత్త విధిస్తోందని వారన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తోందని, తద్వారా రిజర్వేషన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని వారు విమర్శించారు. మనువాద రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest