జాతిరత్నాలు, ఖుషి దర్శకులను అవమానించిన ఆనంద్ దేవరకొండ

ప్రతి సినిమా ప్రమోషన్ కు అభిమానులను థియేటర్లకు తీసుకురావడం ఒక సంస్కృతిగా మారిపోయింది. అలా ఫ్యాన్స్ ను తీసుకురాకపోతే హీరోలకు కిక్ ఉండదు. ఫ్యాన్స్ థియేటర్ కు వచ్చి గోల చెయ్యడం, విజిల్స్ వెయ్యడం వరకు బాగానే ఉంటుంది. అదికాస్తా మితిమీరితేనే ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశా” సినిమా ట్రైలర్ రిలీజ్ లో సరిగ్గా ఇదే జరిగింది. ఈ వేడుక అమీర్ పెట్ లోని ఏషియన్ ఏ ఏ ఏ లో జరిగింది. ముఖ్య అతిధులుగా పిలిచినా వారిని గౌరవించడం తెలుగు వారి సంప్రదాయం. కానీ ఈ సినిమా ట్రైలర్ ఈలీజ్ సందర్బంగా జాతి రత్నాలు సినిమా దర్శకుడికి ఘోర అవమానం జరిగింది. అనుదీప్ కు అవమానం జరిగింది. ఈ వేడుక ప్రారంభంలోనే ఓ జబ్బర్దస్త్ కమెడియన్ తో మాట్లాడించారు. అతను అరగంటకు పైగా టైం వెస్ట్ చేశాడు. అందుకే నిర్మాతల్లో ఒకరు మాట్లాడుతూ తాను మాట్లాడే సమయాన్ని వేరే వాళ్లకు ఇస్తున్నాను అని అన్నారు. ఇదిలా ఉంటె జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్, ఖుషి సినిమా దర్శకుడు శివలను అసలు ఫ్యాన్స్ మాట్లాడనివ్వలేదు. థియేటర్స్ కు వచ్చిన పెయిడ్ ఫ్యాన్స్ చేసిన అల్లరికి రెండు నిముషాలు వినండి అని చెప్పిన ఫ్యాన్స్ ఎవరు వినలేదు. దీంతో వచ్చిన అతిధులు అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ గోల చేయ్యడం మంచిదేకాని అతిధులను గౌరవించడం కూడా నేర్చుకోవాలి. అంతేకాదు ఈ పెయిడ్ ఫ్యాన్స్ కు అసలు యాంకర్ అంటే కూడా గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హీరోలు తమ పెయిడ్ ఫ్యాన్స్ ను తెచ్చుకుంటే మంచిది అనే అభిప్రాయం ఫిలిం నగర్ టాక్ .

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest