అమరావతి(7 జూన్2024):
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డికి ఈనెల 7వ తేదీ నుండి 27వ తేదీ వరకూ అనగా 21 రోజుల పాటు ఆర్జిత సెలవు(earned leave) మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టీ సంఖ్య 1058 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్జిత సెలవు మంజూరు చేయాల్సిందిగా గురువారం ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన నేపధ్యంలో ఆమేరకు అఖిల భారత లీవ్ రూల్స్ 1955 ప్రకారం ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు అనంతరం డా.జవహర్ రెడ్డి తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా సిఎస్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Post Views: 56