డిపాజిట్ గల్లంతు అంటే ఏమిటి?

ఎంపీ..నామినేషన్ వేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్, జనరల్ వారికి అయితే, 25000/- ఎస్సీ ఎస్టీ వారికైతే 12,500/- రూ .. లు. కట్టాలి. ఈ విషయం మీకు తెలుసు.
విత్ డ్రా చేసుకునే సమయాని మీరు విత్ డ్రా చేసుకుంటే మీరు కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వబడతాయి. అట్లా గాక మీరు పోటీలో ఉంటే మీరు ఎలక్షన్లు అయిన తర్వాత వచ్చిన ఓట్లలో 16% మీకు ఓట్లు వస్తేనే మీ డిపాజిట్ మీకు ఇస్తారు లేదంటే మీ డిపాజిట్ ఇవ్వరు.
మీకు అర్థం కావాలంటే… ఒక్క మాటలో చెప్పాలంటే, ఉదాహరణకు.. ఒక లక్ష ఓట్లు వస్తే, అందులో 16% అంటే… 16000, ఓట్లు మీకు రావాలి అన్నమాట. అప్పుడు మీ డబ్బు మీకు తిరిగి ఇస్తారు లేకుంటే మీరు డిపాజిట్ కోల్పోయారని మీరు కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వరు తెలిసినవారికి నేను చెప్పడం లేదు. కేవలం… తెలియని వారి కోసం ఈ మెసేజ్ పెట్టాను.

కామెర ప్రకాష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు
నేతకాని మహర్ సంక్షేమ సంఘం

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest