డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా వదలొద్దు: ముఖ్యమంత్రి రేవంత్

హైదరాబాద్ :

తెలంగాణ లో గంజాయి, డ్రగ్స్, వ్యాపారం పై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా సరే వదిలిపెట్టొద్దని చెప్పారు. ఎంతటివారైనా ఉపేక్షించవద్దని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలని అన్నారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్ ఏర్పాటు చెయ్యాలని సూచించారు. మాదకద్రవ్యాల సప్లై చైన్ ను నాశనం చేయాలన్నారు. శనివారం పొలిసు ఉన్నతాధికారులతో డ్రగ్స్ నిర్ములనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి,డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై సమీక్షలో నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి.ఈ విషయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాలి.అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించండి.సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టండి.గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్ ను బ్రేక్ చేయండి.వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలి.డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా… ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దు.అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయండి.డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్ గా పని చేసేవారిని ప్రోత్సహించండి.డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా.. మీకు ప్రభుత్వం సమకూరుస్తుంది.డ్రగ్స్ పదం వింటేనే భయపడేలా చర్యలుండాలి.తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి.దేశంలో ఇతర రాష్ట్రాలకు TGNAB ఆదర్శంగా నిలవాలి అని ఆయన చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest