Kejriwal got bail ఢిల్లీ ముఖ్యమంత్రికి బెయిల్ -జూన్ 2న తిరిగి జైలుకు

ఢిల్లీ :
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind kejriwal)  కు మధ్యంతర బెయిల్ లభించింది. తిహాడ్ (thihad)జైలులో ఉన్న కేజ్రీవాల్ కు శుక్రవారం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి ఇంటికి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఉన్న తల్లి దండ్రుల పాదాలకు నమస్కరించారు. తల్లిదండ్రులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిదండ్రుల పాదాలకు మొక్కిన కేజ్రీవాల్ మేడలో పూల దండవేసి తల్లి స్వాగతించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మని ల్యాండరింగ్ ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు యాభైరోజుల పాటు జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టు సవాలు చేస్తూ సుప్రీమ్ కోర్టు(suprime court)లో పిటిషన్ వేయగా, ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ కు సుప్రీమ్ కోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి జైలుకు రావాలని కోర్టు షరతులు విధించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest