నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి
నటుడు నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి శ్రీ మోహనకృష్ణ గారికి, బాబాయి శ్రీ బాలకృష్ణ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
పవన్ కళ్యాణ్ తో పాటు రవితేజ, మహేష్ బాబు, అల్లరి నరేష్, నాగ చైతన్య, అనిల్ రావిపూడి , నాగశౌర్య, ఇలా ప్రతి ఒక్కరు తారకరత్న మరణంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 182