తెలంగాణ VCK పార్టీ ఆవిర్భావం-అధ్యక్షుడిగా జిలుకర శ్రీనివాస్

హైదరాబాద్ , ఫిబ్రవరి 24 :
తెలంగాణ లో బహుజనుల రాజ్యాధికారం కోసం వీసీకే పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు తిరుమలావన్ అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞన కేంద్రం లో పార్టీని ఆవిష్కరించారు. పార్టీ ఆఫీస్ బేరర్స్ ను ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా జిలుకర శ్రీనివాస్ ను నియమించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

వి సి కె పార్టీని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించాం. గత మూడునాలుగేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ పని చేస్తోంది.
బహుజనుల ఐక్యత, రాజ్యాధికారం కోసం పని చేస్తున్నాం. తెలంగాణ లో ప్రస్తుతం అధికారికంగా తమ పార్టీని ఆవిష్కరించాం.
తెలంగాణ లో కూడా బహుజనుల ఐక్యత, బహుజనుల రాజ్యాధికారమే తమ ఎజెండా.. ఎస్సి, ఎస్టీ, ఓబీసీ, అండ్ మైనారిటీల కోసమే పని చేస్తాం. బి ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాం. సనాతన ఫాసిజాన్ని రూపుమాపాలి . తెలంగాణ వరకు ఆఫీస్ బేరర్స్ ను ప్రకటించాం. నాన్ దళిత్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. ఇక్కడ అంబేద్కర్ ఉద్యమాలు చాలా బలంగా ఉన్నాయి. మేము ఏ అంబేద్కర్ ఉద్యమానికి వ్యతిరేకం కాదు. బహుజన ఉద్యమానికి కూడా వ్యతిరేకం కాదు. అన్ని ఉద్యమాలను కలుపుకుని వెళ్తాము.

రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జిలుకరా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలను మలుపుతిప్పుకునే ఘటన హైదరాబాద్ లో చోటు చేఉకున్నది. వీసీకే రాష్ట్ర కమిటీని ప్రకటించారని చెప్పారు. తనను అధ్యక్షుడిగా ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మచ్చ దేవేందర్ , జనరల్ సెక్రెటరీ గా షోయబ్, ప్రచార కార్యదర్శిగా ఆనంద్, కోశాధికారికా రవి, అధికార ప్రతినిధిగా పగిడిపల్లి శ్యామ్, ఉస్మాన్ ఖాన్, 27 మంది సభ్యులు ఆఫీస్ బేరర్స్ గా ప్రకటించాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగానికి రాజీనామా చేసి అంబెడ్కర్ హక్కుల ఉద్యమం కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. అందరిని కలుపుకుని ముందుకు వెళ్తామని శ్రీనివాస్ పేర్కొన్నారు.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest