గుంటూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు చంద్రబాబు నాయుడుని ఉండవల్లిలో ఆయన నివాసంలో ఉలమ ఏ హింద్ జాతీయ అధ్యక్షులు మౌలానా సుహైబ్ ఖాసిమి కలిసి మద్దతు తెలిపారు ఈ సందర్బంగా మౌలానా సుహైబ్ ఖాసిమి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టిడిపికి అండగా నిలవాలని జమాత్ ఉలమ ఏ హింద్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించామన్నారు.
లౌకికవాదం, ప్రజాస్వామ్య విధానాలు పాటించే చంద్రబాబుకు మద్దతు తెలియజేయడం సంతోషకరమన్నారు. అంతే కాకుండా హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్ది దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం టిడిపి ప్రభుత్వం హజ్ హౌస్ లు, షాదీఖానాలు, ఉర్దూఘర్ లు నిర్మించారు. అదే విధంగా దుల్హన్ పథకం ద్వారా పేద ముస్లిం మహిళల పెళ్లికి అండగా నిలిచారు. రంజాన్ తోఫాను అందించారు. విదేశీ విద్య ద్వారా వందలాది మంది పేద ముస్లిం విద్యార్ధులు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించారు. మొట్టమొదటిసారి ఉర్దూని రెండో అధికార భాషగా ప్రకటించింది టిడిపినే. ఉర్దూ స్పెషల్ డిఎస్సి ఇవ్వడంతో పాటు అబుల్ కలాం ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ కోసం 200 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కర్నూలులో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. రాజకీయంగా ముస్లిం సమాజానికి తోడ్పాటును అందించారు. ముస్లింలకు స్వయం ఉపాధి కోసం మొట్ట మొదటి సారిగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని పెట్టింది కూడా టిడిపినే. భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాంని భారత రాష్ట్రపతిని చేయడంతో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. దేశంలోనే మొదటిసారిగా ఇమామ్, మౌజనులకు గౌరవ వేతనాలు ఇచ్చారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన టిడిపికి యావత్ ముస్లిం సమాజం వెన్నుదన్నుగా ఉంటుంది. అందుకే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ముస్లిం సోదరిడిపై ఉందని పిలుపునిచ్చారు.చంద్రబాబు సీఎం అయితేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర భవిష్యత్ ను ముందుకు నడిపే శక్తి సామర్థ్యాలు ఆ అల్లా మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నానన్నారు.