బెంగళూరు : బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే కారణంతో తెలుగు సినిమా క్యారెక్టర్ నటి హేమాను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. ఆమెకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం ఆమెను బెంగళూరుకు పిలిపించిన పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హేమ సుమారు పదిమందికి పైగా అమ్మాయిలను తీసుకునివెళ్లినట్టు ఆమెపై అభియోగాలు కూడా ఉన్నాయి.
Post Views: 60