థియేటర్ల బంద్ ఎగ్జిబిటర్స్ వ్యక్తిగత నిర్ణయం.. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎలాంటి సంబధం లేదు
తెలంగాణ రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా థియేటర్స్‌లో ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్టు థియేటర్స్ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. ‘సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తమను సంప్రదించలేదు’ అని ఫిలిం చాంబర్ గురువారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం ఎగ్జిబిటర్స్ వ్యక్తిగతంగా తీసుకున్నారని, దీనిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు సునీల్ నారంగ్, సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Post Views: 51