దక్షిణ ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది : డైరెక్టర్ బుచ్చి బాబు

 

మంత్ర , మంగళ సినిమా ల తో తెలుగు చలన చిత్ర రంగం లొ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ “దక్షిణ ” మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్ నిర్మాణం లొ అశోక్ షిండే నిర్మాత గా కబాలి ఫేమ్ సాయి ధన్షిక కథనాయాకి గా మహాభారత్ మర్డర్స్ ఫేమ్ రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించారు.

ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది, లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు విడుదల చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ… ఈ మధ్య కాలం లొ నన్ను బయపెట్టిన ట్రైలర్ ఇదే అని మళ్ళీ తులసి రామ్ గారు టాలీవుడ్ కి మరో ట్రెండ్ సెట్టర్ సైకో థ్రిల్లర్ ని దక్షిణ సినిమాతో ఇవ్వబోతున్నారు అంటూ అభినందించారు.

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతల తో పాటు చిత్ర బృందం పాల్గొన్నది. దక్షిణ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేవుతోందని త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత అశోక్ షిండే తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest