హైదరాబాద్ :
తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికలు మరో నాలుగు రోజులు ఉన్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ ప్రచారం జోరందుకుంది. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గెలుపుకోసం మహిళా కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. నారీ న్యాయ్ సమ్మేళనం నిర్వహించారు. గురువారం లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అభ్యర్థి దానం నాగేందర్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ గౌడ్, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు పుస్తకాల కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలంబ హాజరైయ్యారు., ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ రెడ్డి తో పాటు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. దానం నాగేందర్ గెలుపుకోసం కృషి చెయ్యాలని ఈ సందర్బంగా అల్కా లాంబా పిలుపునిచ్చారు.