న్యూ ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (BJP ) జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా సంగారెడ్డి పర్యటన రద్దయినట్లు బీజేపీ ప్రకటించింది.డిల్లీ నుంచే వర్చువల్ ద్వారా సంగారెడ్డి బీజేపీ పార్టీ కార్యాలయని నడ్డా ప్రారంభించనున్నారు. నిజానికి 31న సంగారెడ్డికి వచ్చి బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల నడ్డా సంగారెడ్డికి రావడం లేదని ప్రకటించారు.సంగారెడ్డిలో జరిగే సభకు తరుణ్ చుగ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారు.
Post Views: 164