సిద్దిపేట
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా మంత్రి కొండా సురేఖ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేటలో రోడ్ షో పాల్గొన్న మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే, దేశం పురోగమించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని అన్నారు. ఈ పదేళ్ళలో బిజెపి, బిఆర్ఎస్ ప్రజలను దోచుకున్నారే గానీ, ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిన పార్టీగా ఈ దేశానికి సరైన దశ దిశను కాంగ్రెస్ పార్టీ మాత్రమే చూపించగలదని అన్నారు. , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు
Post Views: 92