న్యూ జెర్సీ:
న్యూ జెర్సీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 18వ తేదీన ఉగాది వేదికలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా సహజ నటి జయసుధ హాజరవుతారు. తెలుగు సినిమా గాయని గాయకులు అనుదీప్ దేవ్, సౌజన్య, వాగ్దేవిల సంగీత విభావరి కూడా ఇక్కడ చూపరులను అలరించనుంది. మే 18వ తేదీన(శనివారం) సాయంత్రం 4గంటలకు సేయర్‌విల్లే వార్ మెమోరియల్ హై స్కూల్ లో ఈ వేడుక జరుగనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బహుమతుల ప్రధానోత్సవం కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
Post Views: 107