పసలేని బాహుబలి యానిమేషన్ – మౌళి ముఖం మాడిపోయింది ! Bahubali ni meere kill chesharu

బాహుబలి పాత్రలను తీసుకుని డిస్ని హాట్ స్టార్ వాళ్ళు యానిమేషన్ కథను తాయారు చేశారు. ఇటీవల హైదరాబాద్ లోని ఏ ఎం బీ మాల్ లో మీడియాకు ప్రదర్శించారు. ఈ సందర్బంగా క్యూ అండ్ ఏ కూడా జరిగింది. కొందరు విలేకరులు స్ట్రయిట్ గా ప్రశ్నలు అడిగితే, ఇంకొందరు సోది చెప్పుకుంటే ప్రశ్నలు అడిగారు. బాహుబలి సినిమా సృష్టికర్త ఎస్ ఎస్ రాజమౌళి ఈ వేడుకకు హాజరైయ్యారు. రాజమౌళిని ఒకరిద్దరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. సీనియర్ జర్నలిస్టు ప్రభు, వి6 లక్ష్మి లాంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు రాజమౌళి ముఖం మాడిపోయింది. నిజానికి ఈ ఈవెంట్ కు ఇద్దరు పీ ఆర్ ఓ లు మీడియాకు సమాచారం పంపించారు. ఒకరు మధ్యాహ్నం 1. 30 గంటలకు అని, మరొక పీ ఆర్ ఓ మధ్యాహ్నం 2. 30 గంటలకు అని సమాచారం పంపారు. పీ ఆర్ ఓ ల మధ్య ఎంత సమన్వయ లోపం ఉందొ ఇక్కడే తెలిసిపోయింది. రాజమౌళి పెద్ద దర్శకుడు కాబట్టి నిజంగానే అనుకున్న సమయానికి వస్తారేమో అని చాలామంది జర్నలిస్టులు 1. 30 గంటలకు ఏ ఎం బి మాల్ కు చేరుకున్నారు. ముంబై నుంచి కూడా కొంతమంది మీడియా ప్రతినిధులు వచ్చారు. మొత్తానికి 1. 30 నుంచి మొదలుకొని చివరికి సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ మొదలైంది. అంతకు ముందు ఓ నలభై నిమిషాల పాటు బాహుబలి యానిమేషన్ రెండు ఎపిసోడ్ లను మీడియాకు తెలుగులో ప్రదర్శించారు. 5 గంటలకు ప్రెస్ మీట్ స్టార్ట్ అయితే , ముందుగా యాంకర్ ఒక్కో ప్రశ్న వేదికమీద ఉన్నవాళ్లను అడిగింది. ఆ తరువాత మీడియా చేతికి మైక్ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తనదైన శైలిలో రాజమౌళిని ప్రశ్న అడిగారు. మాకు ఒకటిన్నర గంటలకు అని చెప్పారు….మీకు ఎన్ని గంటలకు చెప్పారు అని ప్రభు అడిగిన ప్రశ్నకు రాజమౌళి ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి. ఆయన 5 గంటలకు అని సమాధానం ఇచ్చారు. ప్రభు అడిగిన ప్రశ్నకు ముఖం మాడ్చుకున్నా రాజమౌళికి ఊహించని మరో ప్రశ్న వి6 లక్ష్మి నుంచి ఎదురయ్యే సరికి రాజమౌళి ముఖం మొత్తం మాడిపోయింది. బాహుబలిని మీరే కిల్ చేశారు అని లక్ష్మి ప్రశ్న అడిగేసరికి రాజమౌళి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది.

యానిమేషన్ బాహుబలి చెత్త !
బాహుబలి సినిమాను రెండు భాగాలుగా రాజమౌళి ఎంత గొప్పగా తీశారో యానిమేషన్ చేసిన వాళ్ళు అంత చెత్తగా తెరకెక్కించారు. పాత్రలు బాహుబలి సినెమాలోనివే.. కథ కూడా ఆదే కానీ అక్కడక్కడా మార్చారు. మెడికకు చూపించిన బాహుబలి యానిమేషన్ మొదటి ఎపిసోడ్ కొంతవరకు పరవాలేదనిపించినా, రెండో ఎపిసోడ్ చెత్తగా ఉంది. చాలామంది జర్నలిస్టులు నిద్రపోయారు. రెండో ఎపిసోడ్ లో కథ సరిగ్గాలేదు. మాహిష్మతి క్యారెక్టర్ కు డబ్బింగ్ చాలా దారుణంగా ఉంది. తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులను కాకుండా ఇతర బాషా వలచేత డబ్బింగ్ చెప్పించినట్టు ఉన్నారు. దీంతో డబ్బింగ్ వినడానికి ఎబ్బెట్టుగా ఉంది. ఒక్క నాజర్ క్యారెక్టర్ డబ్బింగ్ తప్ప మిగిహ డబ్బింగ్ వాయిస్ ఏది సరిగ్గా సెట్ కాలేదు. కథ కూడా చూడ్డానికి పెద్దగా ఆసక్తికరంగా లేదు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest