న్యూ ఢిల్లీ
పార్లమెంట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమైయ్యాయి. దేశంలో అవినీతి పై నిరంతరం పోరాటం చెయ్యాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. నిర్భర్ భరత్ అభివృద్ధితో దేశం ముందుకు వెళ్తోందని అన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి అనుసంధానం చేశామని , వ్యవస్తను మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు. క్రీడా రంగంలో సైతం దేశం తమ సత్త చాటిందని అన్నారు. ఓబీసీలు సంక్షేమం కోసం కేంద్రం పెద్ద ఎత్తున ముందడుగు వేసిందన్నారు. వందే భారత్ ను ఏర్పాటు చేశామని, జమ్మూ కాశ్మీర్ , రైల్వే స్టేష్టన్ లను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. సోలార్ ఎనర్జీ ఇరవై శాతం పెరిగిందన్నారు.
Post Views: 189