PT ఉష పై భగ్గుమన్న రెజ్లర్లు

న్యూ ఢిల్లీ :
భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు పీ టి ఉషాపై రెజ్లర్లు భగ్గుమంటున్నారు. రెజ్లర్లకు పలువురు అథ్లెట్స్ మద్దత్తు పలుకుతుండగా, పీ టి ఉష మాత్రం రెజ్లర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెజ్లర్లు మండి పడుతున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రీజ్ భూషణ్ శరన్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నదని రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నాకు దిగారు. ఈ అంశంపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ జరుపనుంది. ఈ నేపథ్యంలో విషయంపై పీటీ ఉష చేసిన కామెంట్స్ రెజ్లర్లకు ఆగ్రహాన్ని టెప్సితున్నాయి. భారత ఒలంపిక్ కార్యవర్గ సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షురాలిగా ఉన్న పీటీ ఉష, రెజ్లర్లు రోడ్డు మీదకు రావడం క్రమశిక్షణ రాహిత్యమని , వారి చర్యలు దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని చేసిన వ్యాఖ్యలపై దుమారం రెప్గుతోంది. భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్వహణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తున్నామని ఉష పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest